ఐపీఎల్-7: సర్ జడ్డూ సూపర్ షో.. రాజస్థాన్ ఓటమి | IPL-7: Chennai beats Rajasthan by 7 runs | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: సర్ జడ్డూ సూపర్ షో.. రాజస్థాన్ ఓటమి

Published Wed, Apr 23 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM

IPL-7: Chennai beats Rajasthan by 7 runs

దుబాయ్: రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షోతో చెలరేగడంతో రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. ఐపీఎల్-7లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఏడు పరుగులతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది.

141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ను చెన్నయ్ బౌలర్లు మరో బంతి మిగిలుండగా 133 పరుగులకు కట్టడి చేశారు. సర్ జడ్డూ నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్ బ్యాట్స్మెన్ వైఫల్యంతో రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివర్లో ధవళ్ కులకర్ణి (28) రెండు సిక్సర్లు బాది విజయంపై ఆశలు రేకెత్తించినా టంబె రనౌటవడంతో చెన్నయ్ విజయం ఖాయమైంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నయ్ నిర్ణీత ఓవర్లలలో ఆరు వికెట్లకు 140 పరుగులు చేసింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్ (28 బంతుల్లో 50), జడేజా (36 నాటౌట్) మినహా ఇతర బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. రాజస్థాన్ బౌలర్ రజత్ భాటియా రెండు వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement