రాంచీ: ఐపీఎల్ ఏడో అంచెలో రాజస్థాన్ రాయల్స్ 149 పరుగుల లక్ష్యాన్ని చెన్నయ్ సూపర్ కింగ్స్కు నిర్దేశించింది. మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ (36 బంతుల్లో 51) మెరుపు హాప్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ అంకిత్ శర్మ (30)తో కలసి 60 పరుగుల భాగస్వామంతో జట్టుకు శుభారంభం అందించాడు. కాగా వీరిద్దరూ అవుటయ్యాక రాజస్థాన్ జోరు కాస్త తగ్గింది. చివర్లో స్టువర్ట్ బిన్నీ (22) రాణించడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలయ్యారు. చెన్నయ్ బౌలర్లు మోహిత్ శర్మ మూడు, రవీంద్ర జడేజా రెండు రెండేసి వికెట్లు తీశారు.