ముంబై: ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ముంబై ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సంజూ శామ్సన్, కుమార్ నాయర్ రాణించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
శామ్సన్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. నాయర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఫాల్కనర్ 23, హోడ్జ్ 29 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పొలార్డ్, గోపాల్, హర్భజన్ సింగ్, బుమరాహ్ తలో వికెట్ తీశారు.
ముంబై విజయ లక్ష్యం 190 పరుగులు
Published Sun, May 25 2014 9:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement