ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం | bangalore royal challengers beats kolkata knight riders | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం

Published Thu, Apr 24 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

bangalore royal challengers beats kolkata knight riders

షార్జా:ఐపీఎల్-7లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తొలుత కోల్ కతాను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వనించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూర్ కు ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (21), తకావాలే(40) పరుగులు చేసి శుభారంభానిచ్చారు. అనంతరం విరాట్ కోహ్లి(31), యువరాజ్ సింగ్(31) పరుగులు చేసి బెంగళూర్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.

 

కాగా, వీరివురూ అవుటయిన తరువాత పరిస్థితుల్లో ఒక్కసారిగా తేడా వచ్చింది. చివరి ఓవర్ కు 9 పరుగులు చేయాల్సిన క్రమంలో ప్రవీణ్ కుమర్ కు గౌతం గంభీర్ బంతిని అప్పగించాడు.ఆ సమయంలో క్రీజ్ లో డివిలియర్స్, మోర్కెల్ లు ఉన్నారు. తొలి మూడు బంతుల వరకూ విజయం ఇరుజట్ల వైపు దోబూచులాడింది. నాల్గో బంతిని డివిలియర్స్  భారీ షాట్ కొట్టాడానికి యత్నించి అవుటయ్యాడు. ఆ క్యాచ్ ను లెన్ అద్భుతంగా వడిసి పట్టుకోవడంతో  మ్యాచ్ కోల్ కతా వైపు మొగ్గింది.

 

చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన బెంగళూర్ ఒక పరుగు మాత్రమే చేసి కోల్ కతాకు విజయాన్ని అప్పగించింది. కోల్ కతా బౌలర్లలో వినయ్ కుమార్ కు రెండు వికెట్లు లభించగా నరైన్, కల్లిస్ లకు తలో వికెట్టు లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. కోల్ కతా విజయాల రికార్డు బాగానే ఉన్నా కెప్టన్ గౌతం గంభీర్ మాత్రం వరుస మూడు మ్యాచ్ ల్లో డకౌట్ గా వెనుదిరిగా పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement