గౌతమ్ గంభీర్ డకౌట్ల హ్యాట్రిక్
అబుదాబి: కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్-7ను డకౌట్తో ఆరంభించిన గంభీర్ అదే ఆట తీరుతో ముందుకెళుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయి హ్యాట్రిక్ సాధించాడు. పరుగులేమీ చేయకుండా చేయకుండా అవుటవడంలో రికార్డు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా ఉంది అతడి ఆట. మూడు మ్యాచ్ల్లోనూ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పరుగులేమీ చేయకుండానే బ్యాట్ ఎత్తేశాడు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆరంభ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొన్న గంభీర్ ఒక్క పరుగు చేయకుండానే మలింగ బౌలింగ్లో అవుటయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్తో ఆడిన రెండో మ్యాచ్లోనూ డకౌట్ అయ్యాడు. బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా కౌంటర్-నైల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ గంభీర్ ఆట తీరు మారలేదు. ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో ఎల్బీబ్ల్యూగా అవుటయి డకౌట్ల హ్యాట్రిక్ సాధించాడు.