bangalore royal challengers
-
ఐపీఎల్ అంత బోరింగ్‌గా ఉందా..!? అమ్మడు పనికి నెటిజన్లు షాక్!
బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దర్శమిన్చిన దృశ్యాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు స్వయంగా స్టేడియంలో కూచుని చూడటమంటే చాలా ఖరీదైన వ్యవహారం. టికెట్లు దొరకడం చాలా గగనం కూడా. అయితే టికెట్ కొనుక్కుని మరీ మ్యాచ్‌ను చూడటం మానేసిన ఒక అమ్మడు తీరిగ్గా అమెరికన్ పాపులర్ షో చూస్తూ కూచోవడం కెమెరా కంట పడింది. దీంతో ఇది నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్బంగా ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీపక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ "ఈ అమ్మాయి ఐపిఎల్ మ్యాచ్‌లో ‘ఫ్రెండ్స్’ చూస్తోందంటే నమ్మలేకపోతున్నాను" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశాడు. అంతే ఇది లక్షల వ్యూస్, లైక్స్‌తో చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ సంవత్సరం ఐపీఎల్ అస్సలు ఆసక్తికరంగా లేదు, బోరింగ్‌గా కనీసం నా సర్కిల్లో కూడా ఆసక్తికరంగా లేదు’’ ఒకరు, ‘‘ఇందులో నమ్మలేకపోవడానికేమీ లేదు.. చిన్న స్వామి స్టేడియం అంతే.. ఆ అమ్మాయిని నిందించి లాభం లేదు’’ అని మరొకరు "మ్యాచ్ తప్పనిసరిగా బోరింగ్‌గా ఉందేమో బ్రో’’, ‘‘ఆర్సీబీ ఫ్యాన్ అందుకే’’ ఇలా రక రకాల కమెంట్లు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని మూట గట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. Can’t believe this girl is watching Friends during an IPL match 😭 pic.twitter.com/fgL14lPGyC — Deepak Kumaar (@immunewolf_) April 2, 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22నప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్ అనగానే లైవ్‌లో మ్యాచ్‌ను, అభిమాన ఆటగాళ్లను చూడాలనే ఉత్సాహం, థ్రిల్ కోసం స్టేడియం టిక్కెట్లను కూడా బుక్ చేసుకుంటారు. టికెట్లు దక్కని వారు, స్థోమత లేని క్రికెట్ అభిమానులు టెలివిజన్ స్క్రీన్లకు అతుక్కుపోతారు.అన్నట్టు మ్యాచ్ సందర్బంగా కెమెరా మెన్లు పనితీరును మెచ్చుకోవాల్సిందే. మ్యాచ్‌లోని అద్భుత క్షణాలను మాత్రమే కాదు, గ్యాలరీలో చోటు చేసుకునే దృశ్యాలను క్యాప్చర్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటారు. అందమైన అమ్మాయిలు వారి చేష్టలు, సెలబ్రిటీ హావభావాలు, తదితర దృశ్యాలు టీవీల ముందు కూర్చున్నవారికి మంచి కాలక్షేపం. -
WPL 2023: ముంబై సూపర్ షో
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ధనాధన్ ఆల్‌రౌండ్ షోతో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్ బ్యాటింగ్‌లో (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాపార్డర్ బ్యాటర్ నట్ సీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించడంతో ఛేదన సులువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇషాక్, అమెలియా కెర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ హేలీ, బ్రంట్‌ల అజేయ అర్ధ సెంచరీలతో 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. అందరూ అంతంతే! బెంగళూరు స్కోరైతే 150 దాటింది కానీ... ఏ ఒక్క బ్యాటర్‌ది చెప్పుకోదగ్గ స్కోరుగానీ, ఇన్నింగ్స్‌ను కుదుటపర్చిన భాగస్వామ్యంగానీ లేవు. అదే బెంగళూరు పాలిట శాపమైంది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (17 బంతుల్లో 23; 5 ఫోర్లు) మొదలు మేగన్ షట్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) దాకా ఐదుగురు బ్యాటర్లు రిచా, కనిక ఆహుజా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాంక పాటిల్ (15 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారు. అందరు ఇలా వచ్చి అలా షాట్లు బాదేసి పెవిలియన్‌కు వెళ్లినవారే! ఇందులో ఏ ఒక్కరు నిలబడినా, మెరుపుల భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో సమష్టిగా సఫలమయ్యారు. హేలీ, బ్రంట్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ముందున్న లక్ష్యం 156 పరుగులు. అంత సులభమైందేమీ కాదు. కానీ యస్తిక భాటియా (19 బంతుల్లో 23; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన హేలీ మాథ్యూస్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. స్కోరు జోరందుకున్న సమయంలో యస్తికను ప్రీతి బోస్ వికెట్ ముందు దొరకబుచ్చుకుంది. 45 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, బెంగళూరుకు అదే ఆఖరి ఆనందం అయ్యింది. తర్వాత నట్ సీవర్ వచ్చాక హేలీ వేగం మరో దశకు చేరింది. బెంగళూరు కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అటు బ్రంట్, ఇటు హేలీ బౌండరీలను అవలీలగా బాదేస్తుంటే ఆద్యంతం ‘పవర్ ప్లే’నే కనిపించింది. పదో ఓవర్లోనే హేలీ 26 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 10.2 ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. మేగన్ షట్ వేసిన 12, శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్లలో బ్రంట్, హేలీలు ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే ముంబై 40 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని 5.4 ఓవర్ల ముందే ఛేదించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) వాంగ్ (బి) హేలీ 23; సోఫీ (సి) అమన్‌జోత్ (బి) సయిక 16; దిశ (బి) సయిక 0; ఎలైస్ పెర్రీ రనౌట్ 13; హీథెర్‌నైట్ (బి) హేలీ 0; రిచాఘోష్ (సి) నట్ సీవర్ (బి) హేలీ 28; కనిక (సి) యస్తిక (బి) పూజ 22; శ్రేయాంక (ఎల్బీ) (బి) నట్ సీవర్ 23; మేగన్ (స్టంప్డ్) యస్తిక (బి) అమెలియా 20; రేణుక (బి) అమెలియా 2; ప్రీతి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–43, 4–43, 5–71, 6–105, 7–112, 8–146, 9–154, 10–155. బౌలింగ్: హేలీ 4–0–28–3, నట్ సీవర్ 3–0–34–1, సయిక ఇషాక్ 4–0–26–2, ఇసి వాంగ్ 2–0–18–0, అమెలియా కెర్ 3.4–0–30–2, కలిత 1–0–10–0, పూజ 1–0–8–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ నాటౌట్ 77; యస్తిక (ఎల్బీ) (బి) ప్రీతి 23; నట్ సీవర్ నాటౌట్ 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159. వికెట్ల పతనం: 1–45. బౌలింగ్: రేణుక 3–0–28–0, ప్రీతి బోస్ 4–0–34–1, మేగన్ షట్ 3–0–32–0, ఎలైస్ పెర్రీ 1.2–0–18–0, శ్రేయాంక 2–0–32–0, సోఫీ డివైన్ 1–0–11–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో విజార్డ్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
బెంగళూరు బోల్తా.. ఎస్ఆర్హెచ్కు వరుసగా ఐదో విజయం
ఐదేళ్ల క్రితం 2017 ఏప్రిల్ 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49)ను నమోదు చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు దాదాపు అదే ప్రదర్శనను కనబరుస్తూ తమ రెండో అత్యల్ప స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు. ఒక్క బ్యాటర్ కూడా పట్టుదలగా నిలవలేకపోగా, ముగ్గురు డకౌటయ్యారు. ఆ తర్వాత సునాయాస లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించి లీగ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. ముంబై: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన హైదరాబాద్ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది. ] సుయాశ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో జాన్సెన్ (3/25), నటరాజన్ (3/10) ఆర్సీబీని దెబ్బ కొట్టారు. అనంతరం హైదరాబాద్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటం తో మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచిన సన్‌రైజర్స్ భారీగా రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. టపటపా... తొలి ఓవర్లో 5 పరుగులు చేసిన బెంగళూరు పతనం రెండో ఓవర్ నుంచి మొదలైంది. ఈ ఓవర్ వేసిన జాన్సెన్ రెండో బంతికి డుప్లెసిస్ (5) స్టంప్స్ ఎగరగొట్టగా, తర్వాతి బంతికే విరాట్ కోహ్లి (0) వెనుదిరిగాడు. కోహ్లి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘గోల్డెన్ డక్’ నమోదు చేయడం విశేషం. అదే ఓవర్ చివరి బంతికి అనూజ్ రావత్ (0) కూడా అవుటయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి మ్యాక్స్‌వెల్ (12) కూడా పెవిలియన్ చేరగా, స్కోరు 25/4 వద్ద నిలిచింది. సుయాశ్, ఈ సీజన్లో జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తీక్ (0), షహబాజ్ (7) కూడా 7 బంతుల వ్యవధిలో అవుట్ కావడంతో బెంగళూరు కోలుకునే అవకాశం లేకపోయింది. ఒకదశలో ఆర్సీబీ ‘49’ అయినా దాటగలదా అనిపించింది. మరో 23 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం సన్‌రైజర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా మ్యాచ్‌ను ముగించింది. ఛేదనలో అభిషేక్ దూసుకెళ్లాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను, హాజల్‌వుడ్ ఓవర్లో 4 ఫోర్లు బాది సత్తా చాటాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డుప్లెసిస్ (బి) జాన్సెన్ 5; రావత్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0; మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) నటరాజన్ 12; సుయాశ్ (స్టంప్డ్) పూరన్ (బి) సుచిత్ 15; షహబాజ్ (సి) పూరన్ (బి) ఉమ్రాన్ 7; దినేశ్ కార్తీక్ (సి) పూరన్ (బి) సుచిత్ 0; హర్షల్ (బి) నటరాజన్ 4; హసరంగ (బి) నటరాజన్ 8; హాజల్‌వుడ్ (నాటౌట్) 3; సిరాజ్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 68. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–8, 4–20, 5–47, 6–47, 7–49, 8–55, 9–65, 10–68. బౌలింగ్: భువనేశ్వర్ 2.1–0–8–1, జాన్సెన్ 4–0–25–3, నటరాజన్ 3–0–10–3, సుచిత్ 3–0–12–2, ఉమ్రాన్ 4–0–13–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రావత్ (బి) హర్షల్ 47; విలియమ్సన్ (నాటౌట్) 16; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టానికి) 72. వికెట్ల పతనం: 1–64. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0, హాజల్‌వుడ్ 3–0–31–0, హర్షల్ పటేల్ 2–0–18–1, హసరంగ 1–0–7–0. An emphatic win for #SRH as they beat #RCB by 9 wickets 👏🔥 Splendid performance from Kane & Co. This is one happy group right now 😃😃 They move to No.2 on the points table #TATAIPL | #RCBvSRH | #IPL2022 pic.twitter.com/TocgmvruFL — IndianPremierLeague (@IPL) April 23, 2022 -
బెంగళూరు జట్టులో స్టెయిన్
దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ డేల్ స్టెయిన్ మళ్లీ ఐపీఎల్లో అడుగు పెడుతున్నాడు. గాయపడిన కూల్టర్ నీల్ స్థానంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు స్టెయిన్‌ను తీసుకుంది. 2016లో ఆఖరి సారిగా అతను లీగ్‌లో ఆడగా తర్వాతి ఏడాది గాయంతో దూరమయ్యాడు. 2018, 2019 వేలంలలో స్టెయిన్‌ను ఎవరూ తీసుకోలేదు. ఐపీఎల్ తొలి మూడేళ్లలో బెంగళూరుకే ఆడిన స్టెయిన్ ఆ తర్వాత రెండు హైదరాబాద్ జట్లు డీసీ, సన్‌రైజర్స్, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 90 ఐపీఎల్ మ్యాచ్‌లలో అతను 6.72 ఎకానమీతో 92 వికెట్లు పడగొట్టాడు. -
టైటిల్ 'బెంగ' తీరేనా?
ప్రపంచ క్రికెట్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి. భారత కెప్టెన్‌గా కూడా చిరస్మరణీయ విజయాలు అందుకుంటున్నాడు. అదేంటో గానీ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం అతనికి ఏదీ కలిసి రావడం లేదు. అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న సమయంలో కూడా టీమ్ టైటిల్ కోరిక తీరలేదు. 2011 నుంచి వరుసగా ఎనిమిది సీజన్ల పాటు నాయకుడిగా వ్యవహరించినా, విరాట్ తన టీమ్‌ను విజేతగా నిలపలేకపోయాడు. ప్రతీసారి భారీ అంచనాలతో బరిలోకి దిగడం, కీలక సమయంలో చతికిల పడటం అలవాటుగా మార్చుకున్న ఆర్సీబీ ఈ సారైనా తమ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేక ఎప్పటిలాగే కొన్ని గుర్తుంచుకునే మెరుపు ప్రదర్శనలతో సరి పెట్టి ఆటను ముగిస్తుందా చూడాలి. బలాలు: 2016లో విరాట్ కోహ్లి ఏకంగా 973 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును ఫైనల్ చేర్చాడు. గత రెండు సీజన్లు కోహ్లి ఆ స్థాయిలో చెలరేగకపోవడంతో జట్టుపై ప్రభావం పడి ఎనిమిదో, ఆరో స్థానాలకే టీమ్ పరిమితమైంది. ఇప్పుడు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లిపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. అతనికి తోడుగా డివిలియర్స్ ఎలాగూ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమైన తర్వాత వరుసగా టి20లీగ్‌లపైనే దృష్టి పెట్టిన డివిలియర్స్... బంగ్లా లీగ్, పీఎస్ఎల్లలో కలిపి గత పది మ్యాచ్‌లలో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీతో పాటు మరో ఐదు ఇన్నింగ్స్‌లలో దూకుడుగా ఆడుతూ 30కి పైగా పరుగులు చేయడం అతని ఫామ్‌ను సూచిస్తోంది. విదేశీ ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ, గ్రాండ్‌హోమ్ ధాటిగా ఆడగల సమర్థులు. ఈసారి కొత్తగా జట్టులోకి వచ్చిన విండీస్ ఆటగాడు హెట్‌మైర్‌పై కూడా జట్టు ఆధారపడుతోంది. భారత్‌తో ఇటీవల ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణించిన ఆల్‌రౌండర్ స్టొయినిస్ జట్టులో ఉండటం బెంగళూరు బలాన్ని పెంచుతోంది. బౌలింగ్‌లో గత సంవత్సరం ఉమేశ్ యాదవ్ చెలరేగి 20 వికెట్లు పడగొట్టాడు. లెగ్‌స్పిన్నర్ చహల్ కూడా కేవలం 7.26 ఎకానమీతో 12 వికెట్లు తీయగా...ఈ ఏడాది కాలంలో భారత బౌలర్‌గా అతను ఎంతో ఎదిగాడు. మరో పేసర్‌గా ఆడే అవకాశం ఉన్న కూల్టర్ నీల్‌కు భారత్‌లో మంచి అనుభవం ఉంది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కూడా వరుసగా రెండో సంవత్సరం ఇదే జట్టు తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కొత్తగా వచ్చిన లెగ్‌స్పిన్నర్ ప్రయాస్ రే బర్మన్ కూడా ప్రభావం చూపించగలడని ఆర్సీబీ నమ్ముతోంది. బలహీనతలు: ఒకప్పుడు గేల్ జట్టులో ఉండగా టాప్–3 విధ్వంసం సృష్టించినా ఆర్సీబీకి టైటిల్ దక్కలేదు. ఇప్పుడు కూడా కోహ్లి, డివిలియర్స్‌లను మినహాయిస్తే కచ్చితంగా చెలరేగిపోగలడని నమ్మే పరిస్థితి లేదు. వీరిద్దరు మినహా జట్టులో చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. పార్థివ్ పటేల్, గుర్కీరత్ మాన్, మిలింద్ కుమార్, క్లాసెన్‌ల బ్యాటింగ్నుంచి ఏం ఆశించగలం! శివమ్ దూబే మొదటి సారి ఐపీఎల్ ఆడుతున్నాడు. గతంలో చాలా సార్లు ఇబ్బంది పెట్టిన మిడిలార్డర్ బలహీనతే జట్టుపై మళ్లీ ప్రభావం చూపే అవకాశం ఉంది. పైగా జట్టులో ఉన్న విదేశీ ఆల్రౌండర్లలో ఒక్కరూ కూడా ఐదో బౌలర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వర్తించగల సమర్థులు కాదు. స్టొయినిస్, కూల్టర్‌నీల్, అలీ మొత్తం టోర్నీలో అందుబాటులో ఉండటం లేదు. విరాట్ చెప్పినట్లు ప్రణాళికలు సమర్థంగా అమలు చేస్తే ఈ సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు జట్టుకు ఉన్నాయి. కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఈ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), అ„Š దీప్, చహల్, శివమ్ దూబే, గుర్కీరత్, హిమ్మత్, ఖెజ్రోలియా, మిలింద్, సిరాజ్, పవన్ నేగి, దేవ్‌దత్, పార్థివ్, రే బర్మన్, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్ (భారత ఆటగాళ్లు), అలీ, గ్రాండ్‌హోమ్, డివిలియర్స్, హెట్ మైర్, క్లాసెన్, సౌతీ, స్టొయినిస్ (విదేశీ ఆటగాళ్లు). కొసమెరుపు... తాజా సీజన్లో ప్రొ కబడ్డీ లీగ్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, ముస్తాక్ అలీ టి20 టోర్నీ, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్స్‌ను కర్ణాటక/బెంగళూరు జట్లే గెలుచుకున్నాయి. ఇదే జోరులో ఐపీఎల్లో కూడా అన్నీ అనుకూలిస్తాయని వీరాభిమానులు భావిస్తున్నారు. అందుకే తుది ఫలితం సంగతేమో కానీ ప్రస్తుతాని కైతే తమ జట్టే గెలుస్తుందంటూ కన్నడలో ‘ఈ సాలా కప్ కప్ నమ్దే’ అంటూ పాడుకుంటున్నారు! -
సూపర్ సంజు...
రాజస్తాన్ రాయల్స్ జూలు విదిల్చింది. సంజు శామ్సన్ సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియం హోరెత్తగా... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంబేలెత్తిపోయింది. ఘనమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా రికార్డు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. బెంగళూరు: గత మ్యాచ్‌లో వరుణుడి దయతో ఢిల్లీపై గెలిచిన రాజస్తాన్ రాయల్స్... ఈసారి బెంగళూరును దాని సొంతగడ్డపైనే సాధికారికంగా ఓడించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు సంజు శామ్సన్ (45 బంతుల్లో 92 నాటౌట్; 2 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్, కెప్టెన్ రహానే (20 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లి (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మన్దీప్ సింగ్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మినహా మిగతావారు విఫలమవడంతో బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓటమి పాలైంది. శ్రేయస్ గోపాల్ (2/22) పొదుపైన బౌలింగ్‌తో పాటు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని నిలువరించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు రహానే దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. అయితే... మరో ఓపెనర్ షార్ట్ (11) త్వరగా వెనుదిరగడమే బెంగళూరుకు శాపమైంది. క్రీజులోకి వచ్చిన సంజు ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. అర్ధ సెంచరీకి 34 బంతులు ఆడిన అతడు మిగతా 42 పరుగులను 11 బంతుల్లోనే చేశాడంటేనే ఎంత జోరుగా ఆడాడో తెలుస్తోంది. సంజు ఇన్నింగ్స్‌లో 71 పరుగుల వరకు ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం. ఈ క్రమంలో అతడికి స్టోక్స్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (5 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) సహకారం అందించారు. బాదలేకపోయారు... హేమాహేమీలైన బ్యాట్స్‌మెన్‌కు తోడు చిన్న మైదానం కావడంతో ఛేదనపై బెంగళూరు ఆశలకు తొలి ఓవర్లోనే గండిపడింది. కె.గౌతమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మెకల్లమ్ (4)... స్టోక్స్ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. డికాక్ (26) తోడుగా కోహ్లి రన్‌రేట్ పడిపోకుండా చూశాడు. కానీ అతడితో పాటు డివిలియర్స్ (20; 1 ఫోర్, 1 సిక్స్) స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో దెబ్బపడింది. ఈ దశలో మన్దీప్, సుందర్ 28 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. -
గుజరాత్ వారెవ్వా..!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో గురువారం బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ గెలుపొందింది. బెంగళూరు బ్యాటింగ్ లో మరోసారి విఫలం చెంది కుదేలయ్యింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లును చేజార్చుకుంటూ స్వల్ప స్కోరుకే పరిమితమైంది విరాట్ సేన. ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో బెంగళూరు 135 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆర్సీబీ ఆటగాళ్లలో కేదర్ జాదవ్(31), పవన్ నేగీ(32)లే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. మరొవైపు గుజరాత్ లయన్స్ బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ రాణించి ఆర్సీబీని కట్టడి చేసింది. గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు రెండు,తంపి, సోని,ఫాల్కనర్ లకు తలో వికెట్ దక్కింది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఓపెనర్లు మంచి భాగస్వామ్య నమోదు చేయడంలో విఫలమయ్యారు. మెక్కల్లమ్(3, ఆరు బంతుల్లో) క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(16, 11బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఓపెనర్ల విఫలంతో కష్టాల్లో పడ్డ జట్టును ఫించ్(72, 34 బంతుల్లో, ఆరు సిక్సులు, ఐదు ఫోర్లు) ఆదుకున్నాడు. మరో ఎండ్‌లో రైనా(34, 30 బంతుల్లో, ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు) ఫించ్‌కు అండగా నిలిచాడు. చివర్లో ఫించ్ అవుటైనా అప్పటికే జట్టు విజయం ఖాయమైంది. మ్యాచ్ మరో 37 బంతులు మిగిలివుండగానే పూర్తయింది. -
మేం ఐపీఎల్ గెలిచేశాం..!
ఈ సీజన్ ఐపీఎల్‌ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గెలిచినట్లే తాము భావిస్తున్నామని ఆ జట్టు క్రికెటర్ కె.ఎల్.రాహుల్ అన్నాడు. ‘ఓ దశలో మేం ప్లేఆఫ్‌కు చేరడమే కష్టంలా అనిపించింది. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవోలా పోరాడి పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరడమే గొప్ప ఘనత. జట్టులో అందరిలోనూ ఆత్మవిశ్వాసం ఉంది. మేం ఈ సీజన్ విజేతలమనే భావిస్తున్నాం’ అని రాహుల్ చెప్పాడు. -
ముంబైకి మళ్లీ పొ‘లార్డ్’
► బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ► బెంగళూరుపై ముంబై విజయం ► కోహ్లి సేన ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం ఐపీఎల్లో కీలక సమయంలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ముంబైని గెలిపించే పొలార్డ్ మరోసారి తన విలువను నిరూపించుకున్నాడు. లక్ష్యఛేదన క్లిష్టంగా మారిన సమయంలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లోనే బెంగళూరుతో గత మ్యాచ్‌లో 19 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసి ముంబైని గెలిపించిన పొలార్డ్... మరోసారి అదే జట్టుపై 19 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి గెలిపించాడు. అటు బెంగళూరు జట్టు కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇకపై అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు అదృష్టం కూడా తోడైతేనే కోహ్లి సేనకు అవకాశాలు ఉంటాయి. బెంగళూరు: బౌలింగ్ బలహీనంగా ఉన్నా... బ్యాటింగ్ బలంతో ఈ సీజన్లో నెట్టుకొస్తున్న బెంగళూరు జట్టును కీలక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ముంచేశారు. బ్యాటింగ్‌కు స్వర్గథామంలాంటి పిచ్‌పై స్టార్ క్రికెటర్లంతా విఫలం కావడంతో కోహ్లి సేన ఓడిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 6 వికెట్లతో బెంగళూరుపై గెలిచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 151 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (53 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సచిన్ బేబీ (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గేల్, కోహ్లి విఫలం కాగా... డివిలియర్స్ (27 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో సౌతీ, మెక్లీనగన్, క్రునాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (47 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... పొలార్డ్ (19 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (11 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్ క్రునాల్ పాండ్యా (1/15)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. నిలబెట్టిన భాగస్వామ్యం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (7) సిక్సర్‌తో ఖాతా తెరిచినా మెక్లీనగన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చిన గేల్ (5) కూడా విఫలమయ్యాడు. దీంతో బెంగళూరు 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లోకేశ్ రాహుల్, డివిలియర్స్ కలిసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నెమ్మదిగా ఆడటంతో పరుగులు రాలేదు. దీంతో బెంగళూరు 10 ఓవర్లలో రెండు వికెట్లకు 60 పరుగులు మాత్రమే చేసింది. 11వ ఓవర్ తొలి బంతికే భారీ షాట్‌కు వెళ్లి డివిలియర్స్ అవుటయ్యాడు. వాట్సన్ కూడా కుదురుకునేందుకు సమయం తీసుకోవడంతో బెంగళూరు 14 ఓవర్లకు 76 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో రాహుల్ వేగం పెంచాడు. మెక్లీనగన్ బౌలింగ్‌లో సిక్సర్, రెండు ఫోర్లు కొట్టాడు. అయితే రెండో ఎండ్‌లో వాట్సన్ రనౌటయ్యాడు. 42 బంతుల్లో రాహుల్ ఈ సీజన్లో మూడో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాక... చివరి మూడు ఓవర్లలో చెలరేగి ఆడాడు. రెండో ఎండ్‌లో సచిన్ బేబీ కూడా భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 27 బంతుల్లో 53 పరుగులు జోడించడంతో బెంగళూరుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఆదుకున్న పొలార్డ్, బట్లర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అరవింద్ బౌలింగ్‌లో పార్థీవ్ అవుట్ కావడంతో ముంబైకి షాక్ తగిలింది. అయితే కెప్టెన్ రోహిత్, రాయుడు కుదురుగా ఆడటంతో పవర్‌ప్లేలో 39 పరుగులు వచ్చాయి. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించాక రోహిత్ శర్మ అవుటయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన నితిష్ రాణా (9) ఒక సిక్సర్ కొట్టినా ఎక్కువసేపు నిలబడలేదు. ఆరోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన రాయుడు... ఓ ఎండ్‌లో నిలకడగా ఆడాడు. ముంబై విజయానికి 6 ఓవర్లలో 68 పరుగులు అవసరమైన దశలో వాట్సన్ బౌలింగ్‌లో పొలార్డ్ సిక్సర్, ఫోర్‌తో ఒత్తిడి పెంచాడు. కానీ తర్వాతి ఓవర్లో డివిలియర్స్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రాయుడు అవుటయ్యాడు. ముంబైకి 4 ఓవర్లలో 44 పరుగులు అవసరం కాగా... వాట్సన్ వేసిన 17వ ఓవర్లో పొలార్డ్ ధాటికి 18 పరుగులు వచ్చాయి. అటు బట్లర్ కూడా చెలరేగి ఆడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే ముంబై గెలిచింది. పొలార్డ్, బట్లర్ ఐదో వికెట్‌కు అజేయంగా 21 బంతుల్లో 55 పరుగులు జోడించడం విశేషం. స్కోరు వివరాలు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: కోహ్లి (సి) హర్భజన్ (బి) మెక్లీనగన్ 7; గేల్ (సి) రోహిత్ (బి) సౌతీ 5; డివిలియర్స్ (సి) రాయుడు (బి) క్రునాల్ 24; రాహుల్ నాటౌట్ 68; వాట్సన్ రనౌట్ 15; సచిన్ బేబీ నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1-8; 2-17; 3-60; 4-98. బౌలింగ్: సౌతీ 4-0-27-1; మెక్లీనగన్ 4-0-35-1; బుమ్రా 4-0-28-0; క్రునాల్ పాండ్యా 4-0-15-1; హర్భజన్ 3-0-19-0; పొలార్డ్ 1-0-22-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 25; పార్థీవ్ (సి) వాట్సన్ (బి) అరవింద్ 1; రాయుడు (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 44; నితిష్ రాణా (సి) బిన్నీ (బి) చాహల్ 9; పొలార్డ్ నాటౌట్ 35; బట్లర్ నాటౌట్ 29; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-2; 2-60; 3-79; 4-98. బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 1-0-2-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-23-1; జోర్డాన్ 3-0-37-0; వాట్సన్ 3-0-38-0; చాహల్ 4-0-16-1; ఆరోన్ 3.4-0-37-2. -
ఆర్సీబీకి రసూల్, రాహుల్
న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్.. ఈ సీజన్ ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు ఆడనున్నారు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ ఇద్దరు ఆటగాళ్లను ట్రాన్స్ఫర్ విండోలో ఆర్సీబీకి పంపింది. వీరిద్దరు ఏ జట్టుతోనైనా ఇమిడిపోగలరని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ జట్టుకు ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో రాహుల్ తమకు చాలా ఉపయోగపడతాడని ఆర్సీబీ యజమాని విజయ్ మాల్యా అన్నారు. కర్ణాటక స్థానిక ఆటగాడు తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రసూల్ తమకు మరో అవకాశాన్ని ఇచ్చాడన్నారు. -
కోహ్లి హాఫ్ సెంచరీ; బెంగళూరు 160/6
హైదరాబాద్: ఐపీఎల్-7లో భాగంగా సోమవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 161 పరుగుల విజయ్ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. గేల్(14) నిరాశపరిచాడు. యువరాజ్ 21, డీవిలియర్స్ 29 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. రసూల్, కేవీ శర్మ, యూసఫ్ పఠాన్ ఒక్కో వికెట్ తీశారు. -
చెన్నైసూపర్ కింగ్స్ పై బెంగళూర్ ఛాలెంజర్స్ విజయం
రాంచీ:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ చెన్నై తో జరిగిన కీలక మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని బెంగళూర్ ..ఇంకా ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగా విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది. బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు ఓపెనర్ పార్ధీవ్ పటేల్ (10) పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికీ, క్రిస్ గేల్ (46) పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లి(27) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ చివర్లో ఏబీ డివిలియర్స్(28) పరుగులను దూకుడుగా చేయడంతో బెంగళూర్ గెలుపొందింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ ,డేవిడ్ హస్సీలకు తలో రెండు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్టు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు స్మిత్ (9), మెక్ కలమ్(19) ఆదిలోనే పెవిలియన్ కు చేరి అభిమానులకు షాకిచ్చారు. అనంతరం సురేష్ రైనా , డేవిడ్ హస్సీలు బాధ్యాతయుతంగా ఆడటంతో చెన్నై తేరుకుంది. హస్సీ(25) పరుగులతో ఫర్వాలేదనిపించినా, కెప్టెన్ ధోని (7) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా రైనా(62; 48 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్) చివరివరకూ క్రీజ్ లో ఉండి చెన్నై 138 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్ లకు తలో వికెట్టు లభించింది. -
ఐపీఎల్ 7: బెంగళూర్ విజయలక్ష్యం 139
రాంచీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్నమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు స్మిత్ (9), మెక్ కలమ్(19) ఆదిలోనే పెవిలియన్ కు చేరి అభిమానులకు షాకిచ్చారు. అనంతరం సురేష్ రైనా , డేవిడ్ హస్సీలు బాధ్యాతయుతంగా ఆడటంతో చెన్నై తేరుకుంది. హస్సీ(25) పరుగులతో ఫర్వాలేదనిపించినా, కెప్టెన్ ధోని (7) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా రైనా(62; 48 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్) చివరివరకూ క్రీజ్ లో ఉండి చెన్నై 138 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్ లకు తలో వికెట్టు లభించింది. లీగ్ లు చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ మ్యాచ్ లో బెంగళూర్ కు విజయం అనివార్యం. ఇందులో బెంగళూర్ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. -
బెంగళూర్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
బెంగళూర్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ విసిరిన199 భారీ పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ ఆదిలోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ క్రిస్ గేల్(4), విరాట్ (0) కే పెవిలియన్ చేరడంతో బెంగళూర్ కష్టాలను కొనితెచ్చుకుంది. కేవలం 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూర్ ఇక తేరుకోలేకపోయింది. బెంగళూర్ ఆటగాళ్లలో ఒక్క డివిలియర్స్ (53) పరుగుల మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో బెంగళూర్ కు ఓటమి తప్పలేదు. చివర్లో స్టార్క్ (29) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ కు మూడు వికెట్లు లభించగా, బాలాజీ, శివం శర్మలకు తలో రెండు వికెట్లు దక్కాయి. అంతకముందు టాస్ గెలిచిన బెంగళూర్ తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (30), మన్ దీప్ సింగ్(29) పరుగులు చేసి పంజాబ్ కు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మ్యాక్స్ వెల్ (25;2 సిక్స్ల్ లు, 2 ఫోర్లు)తో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. తరువాత మరో హిట్టర్ మిల్లర్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ (66;3 సిక్స్ లు, 8 ఫోర్లు)తో పంజాబ్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.చివర్లో సాహా(17), మిచెల్ జాన్సన్ (16) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో స్టార్క్, హర్సాల్ పటేల్, చాహాల్ కు తలో రెండు వికెట్లు లభించాయి. -
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యం 199
బెంగళూర్:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 199 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బెంగళూర్ తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (30), మన్ దీప్ సింగ్(29) పరుగులు చేసి పంజాబ్ కు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మ్యాక్స్ వెల్ (25;2 సిక్స్ లు, 2 ఫోర్లు)తో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.తరువాత మరో హిట్టర్ మిల్లర్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ (66;3 సిక్స్ లు, 8 ఫోర్లు)తో పంజాబ్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. చివర్లో సాహా(17), మిచెల్ జాన్సన్ (16) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో స్టార్క్, హర్సాల్ పటేల్, చాహాల్ కు తలో రెండు వికెట్లు లభించాయి. -
బెంగళూర్ పై రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయం
-
బెంగళూర్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
అబుదాబి: ఐపీఎల్ 7 టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఏమాత్రం పోరాడని బెంగళూర్ ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ విఫలమై ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి బెంగళూర్ 71 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించి ముందుగానే ఓటమిని ఖాయం చేసుకుంది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు అజాంకే రహానే(23) పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా, కరుణ్ నాయర్ (8) పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం శ్యాంసన్ (2) పరుగులకే పెవిలియన్ కు చేరడంతో రాజస్థాన్ కాస్త తడబడినట్టి కనిపించింది. కాగా మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు వాట్సన్(24), అభిషేక్ నాయర్(11) పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. కేవలం 12.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూర్ ఆటగాళ్లు 70 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (1), తకావాలే (0)కు పరిమితమై ఆదిలోనే బెంగళూర్ ను కష్టాల్లోకి నెట్టారు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి(21)పరుగులు చేసి జట్టుకు మరమ్మత్తులు చేశాడు. కాగా యువరాజ్ సింగ్(3),డివిలియర్స్(0),రానా(3), మోర్కెల్ (7) ఇలా వరుసుగా క్యూకట్టడంతో బెంగళూర్ బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. చివర్లో స్టార్క్(18), రాంపాల్ (13) పరుగులు చేయడంతో బెంగళూర్ 15 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. బెంగళూర్ ఆటగాళ్లలో 8మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో టాంబే నాలుగు వికెట్లు తీసి బెంగళూర్ పతనాన్ని శాసించగా, రిచర్డ్ సన్ కు రెండు వికెట్లు దక్కాయి. -
70 పరుగులకే ఆలౌటయిన బెంగళూర్
అబుదాబి:మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. ఐపీఎల్ 7 లో భాగంగా శనివారం ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ ఆటగాళ్లు 71 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించారు. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (1), తకావాలే(0)కు పరిమితమై ఆదిలోనే బెంగళూర్ ను కష్టాల్లోకి నెట్టారు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి(21)పరుగులు చేసి జట్టుకు మరమ్మత్తులు చేశాడు. కాగా యువరాజ్ సింగ్(3),డివిలియర్స్(0),రానా(3), మోర్కెల్ (7) ఇలా వరుసుగా క్యూకట్టడంతో బెంగళూర్ బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. చివర్లో స్టార్క్(18), రాంపాల్ (13) పరుగులు చేయడంతో బెంగళూర్ 15 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. బెంగళూర్ ఆటగాళ్లలో 8మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో టాంబే నాలుగు వికెట్లు తీసి బెంగళూర్ పతనాన్ని శాసించగా, రిచర్డ్ సన్ కు రెండు వికెట్లు దక్కాయి. -
ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం
షార్జా:ఐపీఎల్-7లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తొలుత కోల్ కతాను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వనించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూర్ కు ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (21), తకావాలే(40) పరుగులు చేసి శుభారంభానిచ్చారు. అనంతరం విరాట్ కోహ్లి(31), యువరాజ్ సింగ్(31) పరుగులు చేసి బెంగళూర్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. కాగా, వీరివురూ అవుటయిన తరువాత పరిస్థితుల్లో ఒక్కసారిగా తేడా వచ్చింది. చివరి ఓవర్ కు 9 పరుగులు చేయాల్సిన క్రమంలో ప్రవీణ్ కుమర్ కు గౌతం గంభీర్ బంతిని అప్పగించాడు.ఆ సమయంలో క్రీజ్ లో డివిలియర్స్, మోర్కెల్ లు ఉన్నారు. తొలి మూడు బంతుల వరకూ విజయం ఇరుజట్ల వైపు దోబూచులాడింది. నాల్గో బంతిని డివిలియర్స్ భారీ షాట్ కొట్టాడానికి యత్నించి అవుటయ్యాడు. ఆ క్యాచ్ ను లెన్ అద్భుతంగా వడిసి పట్టుకోవడంతో మ్యాచ్ కోల్ కతా వైపు మొగ్గింది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన బెంగళూర్ ఒక పరుగు మాత్రమే చేసి కోల్ కతాకు విజయాన్ని అప్పగించింది. కోల్ కతా బౌలర్లలో వినయ్ కుమార్ కు రెండు వికెట్లు లభించగా నరైన్, కల్లిస్ లకు తలో వికెట్టు లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. కోల్ కతా విజయాల రికార్డు బాగానే ఉన్నా కెప్టన్ గౌతం గంభీర్ మాత్రం వరుస మూడు మ్యాచ్ ల్లో డకౌట్ గా వెనుదిరిగా పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. -
ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ విజయం
దుబాయ్:ఐపీఎల్-7లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ రోజు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఆటగాళ్లు 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబై విసిరిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్ మడ్డిన్ సన్ (12) పెవిలియన్ కు చేరుకున్నప్పటికీ, పార్థివ్ పటేల్ నిలకడగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ హీరోలు విరాట్ కోహ్లి (0), యువరాజ్(0) వరుసగా పెవిలియన్ చేరడంతో ఓ దశలో బెంగళూర్ కాస్త తడబడింది. కాగా, పార్థీవ్(56), డివిలియర్స్ (45) పరుగులు చేయడంతో బెంగళూర్ రాయల్స్ 17.3ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్లు వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. మైక్ హస్సీ(16), టేర్(17) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం అంబటి రాయుడు చేసిన (35) పరుగులు ముంబై ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రోహిత్ శర్మ(2),పొలార్డ్ (3) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కో్ల్పోయి 115 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
యువరాజ్ ‘హాట్’!
ముంబై: పుణే వారియర్స్ జట్టు రద్దు కావడంతో భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రస్తుతం వేలంలో అందరికీ అందుబాటులో ఉన్నాడు. దాంతో అతడిని సొంతం చేసుకునేందుకు ఐపీఎల్‌లోని నాలుగు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో అతను ఆడిన పంజాబ్‌తో పాటు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు కూడా యువీ కోసం ప్రయత్నిస్తున్నాయి. తాజా కబురు: బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ (ఆర్సీబీ) జట్టు మాత్రం యువీ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇందుకోసం చొరవ ప్రదర్శిస్తున్నాడు. ఆర్సీబీలో చేరే విధంగా అతను ఇప్పటికే యువరాజ్‌తో మాట్లాడినట్లు సమాచారం. యువీ రాకతో తమ జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారుతుందని బెంగళూరు భావిస్తోంది. ఎందుకీ ఆసక్తి: భారత వన్డే జట్టులో చోటు లేకపోయినా యువీ టి20ల్లో ఇప్పటికీ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఈ ఫార్మాట్లో అతని లెఫ్టార్మ్ స్పిన్, చురుకైన ఫీల్డింగ్ ఏ జట్టుకైనా బలమే. పాత రికార్డు: ఐపీఎల్లో యువరాజ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్, పుణే వారియర్స్ జట్ల తరఫున ఆడాడు. మొత్తం 68 ఇన్నింగ్స్‌లలో 25.00 సగటుతో 1475 పరుగులు చేశాడు. 130.76 స్ట్రైక్ రేట్ ఉన్న యువీ...లీగ్‌లో ఇప్పటి వరకు 82 సిక్సర్లు బాదాడు. తాజా ఫామ్: శనివారంనుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగితే వేలంలో యువీకి తిరుగుండదు. యువీ తాను ఆడిన ఆఖరి రెండు టి20ల్లో అద్భుత ఇన్నింగ్స్ (పాక్‌పై 36 బంతుల్లో 72, ఆస్ట్రేలియాపై 35 బంతుల్లో 77 నాటౌట్) ఆడటం గమనార్హం. వేలంలో భారీ విలువ: వచ్చే నెల 12, 13 తేదీలలో ఐపీఎల్ వేలం జరగనుంది. చెన్నై, ముంబై మినహా అందరి దగ్గరా భారీగా డబ్బు ఉంది. కాబట్టి యువీ జాక్‌పాట్ కొట్టొచ్చు.