ఆర్‌సీబీకి రసూల్, రాహుల్ | IPL seson | Sakshi
Sakshi News home page

ఆర్‌సీబీకి రసూల్, రాహుల్

Published Wed, Feb 17 2016 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

IPL seson

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్.. ఈ సీజన్ ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు ఆడనున్నారు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ ఇద్దరు ఆటగాళ్లను ట్రాన్స్‌ఫర్ విండోలో ఆర్‌సీబీకి పంపింది. వీరిద్దరు ఏ జట్టుతోనైనా ఇమిడిపోగలరని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. కోహ్లి నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టుకు ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో రాహుల్ తమకు చాలా ఉపయోగపడతాడని ఆర్‌సీబీ యజమాని విజయ్ మాల్యా అన్నారు. కర్ణాటక స్థానిక ఆటగాడు తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రసూల్ తమకు మరో అవకాశాన్ని ఇచ్చాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement