బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో గురువారం బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ గెలుపొందింది. బెంగళూరు బ్యాటింగ్ లో మరోసారి విఫలం చెంది కుదేలయ్యింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లును చేజార్చుకుంటూ స్వల్ప స్కోరుకే పరిమితమైంది విరాట్ సేన. ఏడుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో బెంగళూరు 135 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆర్సీబీ ఆటగాళ్లలో కేదర్ జాదవ్(31), పవన్ నేగీ(32)లే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు.
మరొవైపు గుజరాత్ లయన్స్ బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ రాణించి ఆర్సీబీని కట్టడి చేసింది. గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు రెండు,తంపి, సోని,ఫాల్కనర్ లకు తలో వికెట్ దక్కింది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఓపెనర్లు మంచి భాగస్వామ్య నమోదు చేయడంలో విఫలమయ్యారు. మెక్‌కల్లమ్(3, ఆరు బంతుల్లో) క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(16, 11బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఓపెనర్ల విఫలంతో కష్టాల్లో పడ్డ జట్టును ఫించ్(72, 34 బంతుల్లో, ఆరు సిక్సులు, ఐదు ఫోర్లు) ఆదుకున్నాడు. మరో ఎండ్‌లో రైనా(34, 30 బంతుల్లో, ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు) ఫించ్‌కు అండగా నిలిచాడు. చివర్లో ఫించ్ అవుటైనా అప్పటికే జట్టు విజయం ఖాయమైంది. మ్యాచ్ మరో 37 బంతులు మిగిలివుండగానే పూర్తయింది.
గుజరాత్ వారెవ్వా..!
Published Thu, Apr 27 2017 11:10 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement
Advertisement