పంత్ ధాటికి లయన్స్ కకావికలం
ఐపీఎల్ 10లో భాగంగా గుజరాత్ లయన్స్‌తో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 209 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్‌లో మరో 15 బంతులు మిగిలి ఉండగానే 214 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ 97(43 బంతులు, 9 సిక్సులు, ఆరు ఫోర్లు) గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంత్ ఆడిన తీరు ఎదుటి టీమ్ ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. పంత్‌కు చక్కని సహకారం అందించిన శాంసన్ 61 పరుగులు చేసి అవుటయ్యాడు. భారీ షాట్‌కు యత్నించిన పంత్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
అప్పటికే ఢిల్లీ విజయం ఖరారు కాగా, తర్వాత వచ్చిన అండర్‌సన్ మిగతా పని కానిచ్చేశాడు. దీంతో గుజరాత్ లయన్స్ జట్టు తన పేరిట ఐపిఎల్‌లో అత్యధిక స్కోర్ చేసినప్పటికీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.