వడోదరలో భారీ ఆధిక్యంతో బీజేపీ విజయం
వడోదర : ప్రధాని నరేంద్ర మోడీ కంచుకోట అయిన వడోదరను భారతీయ జనతా పార్టీ మరోసారి కైవసం చేసుకుంది. వడోదర లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్ బెన్ భట్టా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్పై లక్షా 83 వేల ఓట్ల మెజార్టీతో రంజన్ బెన్ గెలుపొందారు.
మోడీ వడోదర స్థానం నుంచి గెలుపొంది ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. మొత్తం 2,86,880 ఓట్లు పోల్ అవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి 1,04,540 ఓట్లు గెలుచుకున్నారు. మరోవైపు గుజరాత్లోని మణినగర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకుంది.