న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గుజరాత్లో తొమ్మిది అసెంబ్లీ, ఓ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో 45మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేసిన వడోదర లోక్సభ స్థానం కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వడోదరలో బీజేపీ దూసుకెళుతోంది.
* ఇక గుజరాత్, రాజస్థాన్‌లలో ట్రెండ్స్ బీజేపీకి అసంతృప్తి కలిగించే విధంగా ఉన్నాయి. గుజరాత్లో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
* రాజస్థాన్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడుచోట్ల బీజేపీ, ఓ స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి.
* ఉత్తరప్రదేశ్లో 11 అసెంబ్లీ స్థానాల్లో ఆరుచోట్ల బీజేపీ, నాలుగు స్థానాల్లో సమాజ్వాదీ ఆధిక్యంలో ఉండగా, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి.
గుజరాత్, రాజస్థాన్లో బీజేపీ హవా
Published Tue, Sep 16 2014 9:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement