కోహ్లి హాఫ్ సెంచరీ; బెంగళూరు 160/6 | Virat Kolhi Beats Half Century in Hyderbad | Sakshi
Sakshi News home page

కోహ్లి హాఫ్ సెంచరీ; బెంగళూరు 160/6

Published Tue, May 20 2014 5:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

Virat Kolhi Beats Half Century in Hyderbad

హైదరాబాద్: ఐపీఎల్-7లో భాగంగా సోమవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 161 పరుగుల విజయ్ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.

బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. గేల్(14) నిరాశపరిచాడు. యువరాజ్ 21, డీవిలియర్స్ 29 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. రసూల్, కేవీ శర్మ, యూసఫ్ పఠాన్ ఒక్కో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement