
దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ డేల్ స్టెయిన్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగు పెడుతున్నాడు. గాయపడిన కూల్టర్ నీల్ స్థానంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు స్టెయిన్‌ను తీసుకుంది. 2016లో ఆఖరి సారిగా అతను లీగ్‌లో ఆడగా తర్వాతి ఏడాది గాయంతో దూరమయ్యాడు. 2018, 2019 వేలంలలో స్టెయిన్‌ను ఎవరూ తీసుకోలేదు. ఐపీఎల్ తొలి మూడేళ్లలో బెంగళూరుకే ఆడిన స్టెయిన్ ఆ తర్వాత రెండు హైదరాబాద్ జట్లు డీసీ, సన్‌రైజర్స్, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 90 ఐపీఎల్ మ్యాచ్‌లలో అతను 6.72 ఎకానమీతో 92 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment