ఐపీఎల్ 7: బెంగళూర్ విజయలక్ష్యం 139 | chennai super kings set target of 139 runs for bangalore | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ 7: బెంగళూర్ విజయలక్ష్యం 139

Published Sun, May 18 2014 5:43 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

chennai super kings set target of 139 runs for bangalore

రాంచీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్నమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు స్మిత్ (9), మెక్ కలమ్(19) ఆదిలోనే పెవిలియన్ కు చేరి అభిమానులకు షాకిచ్చారు. అనంతరం సురేష్ రైనా , డేవిడ్ హస్సీలు బాధ్యాతయుతంగా ఆడటంతో చెన్నై తేరుకుంది. హస్సీ(25) పరుగులతో ఫర్వాలేదనిపించినా, కెప్టెన్ ధోని (7) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

 

కాగా రైనా(62; 48 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్) చివరివరకూ క్రీజ్ లో ఉండి చెన్నై 138 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్ లకు తలో వికెట్టు లభించింది. లీగ్ లు చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ మ్యాచ్ లో బెంగళూర్ కు విజయం అనివార్యం. ఇందులో బెంగళూర్ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement