'ముంబై 200 పైగా పరుగులు చేస్తుందనుకున్నా'
ముంబై: ఐపీఎల్ 7 లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించడానికి కారణం బౌలర్లనేని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ముంబైను పరుగులు చేయకుండా బౌలర్లు నిలువరించిన కారణంగానే తమ జట్టు విజయం సాధించదన్నాడు. ఆ గెలుపు ఘనత అంతా కూడా వారిదేనని తెలిపాడు. 'ఆది నుంచి స్కోరు బోర్డుపై మంచి రన్ రేట్ తో ఉన్న ముంబై 200 పరుగులు చేస్తుందని భావించాను. ముంబై పటిష్టంగా ఉన్న దశలో మా బౌలర్లు రాణించారు. మిడిల్ ఆర్డర్ లో ఉన్న రోహిత్ శర్మ, పొలార్డ్ , సిమ్మన్స్ లను కట్టడి చేసి విజయం సాధించాం' అని రైనా తెలిపాడు.
ఈ మ్యాచ్ లో కేవలం 33 బంతులు ఎదుర్కున్న రైనా 54 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. డేవిడ్ హస్సీ-రైనా నెలకొల్పిన 89 పరుగుల నాల్గో వికెట్టు భాగస్వామ్యంతో చెన్నై ఘన విజయం సాధించి క్వాలిఫయర్ 2 కు అర్హత సాధించింది. రేపటి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై-పంజాబ్ జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరుగనుంది.