రాంచీ:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా చెన్నై ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన చైన్నైకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. డుప్లెసిస్ (19) పరుగులతో ఫర్వాలేదనిపించినా, స్మిత్ (48; 28 బంతుల్లో 4సిక్స్ లు, 4 ఫోర్లు)తో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం సురేష్ రైనా (4) పరుగులకే పెవిలియన్ చేరాడు.
వరుస వికెట్లు కోల్పోయి రన్ రేట్ మందగించిన తరుణంలో డేవిడ్ హస్సీ(50), ధోని (57) పరుగులతో ఆదుకున్నారు. వీరివురు నాటౌట్ గా చివరి వరకూ క్రీజ్ లో ఉండటంతో చెన్నై నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 185 పరుగులు చేసింది.