ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.
ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్‌రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ నెట్ రన్‌రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.
అతిపెద్ద సానుకూలాంశం
అయితే, రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.
మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్‌కే(మే 18)తో! ఈ మ్యాచ్‌లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!
చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్‌రైజర్స్ మ్యాచ్‌ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్‌రైజర్స్ సీఎస్‌కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రెండు మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?
అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.
‘‘తదుపరి రెండు మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్‌లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్‌లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.
రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్
కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు.
ఇక సన్‌రైజర్స్ గురువారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్
Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
Comments
Please login to add a commentAdd a comment