‘జాక్‌పాట్’ కొట్టేదెవరో! | IPL 7 Auction: Yuvraj may top the priority list of many | Sakshi
Sakshi News home page

‘జాక్‌పాట్’ కొట్టేదెవరో!

Published Wed, Feb 12 2014 12:33 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

‘జాక్‌పాట్’ కొట్టేదెవరో! - Sakshi

‘జాక్‌పాట్’ కొట్టేదెవరో!

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-7 వేలానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేలంలో దేశీయ, జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లలో హేమాహేమీలు అందుబాటులో ఉండనున్నారు.

నేడు, రేపు ఐపీఎల్-7 వేలం
 బరిలో హేమాహేమీలు
అండర్సన్, పీటర్సన్‌లపై
 ఫ్రాంచైజీల కన్ను

 
 బెంగళూరు: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-7 వేలానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేలంలో దేశీయ, జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లలో హేమాహేమీలు అందుబాటులో ఉండనున్నారు. మొత్తం 514 మంది క్రికెటర్లు వేలంలో ఉండగా, ఇందులో 219 (169 భారత్+50 విదేశీ) మంది క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు. అయితే తుది జాబితా ఖరారైన తర్వాత మోరిస్, హాడిన్, మోర్గాన్‌లు వేలం నుంచి తప్పుకున్నారు. తొలిసారి 295 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లను వేలం వేయనున్నారు. మొత్తం క్రికెటర్లను 53 సెట్లుగా విభజించారు.
 
  ప్రతి సెట్‌లో 8 నుంచి 10 మంది క్రికెటర్లు ఉంటారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై జస్టిస్ ముద్గల్ కమిటీ తన విచారణ నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసినా... వేలంపై ఇది ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. మరోవైపు కోర్టు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని ఫ్రాంచైజీలు వేలంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. షెడ్యూల్ ప్రకారం వేలం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని బెంగళూరు ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యా అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కథ కొత్తదేమీ కాదని కేకేఆర్ సీఈఓ  వెంకీ మైసూర్ వ్యాఖ్యానించారు.
 
 వేలం విశేషాలు
 ప్రతి జట్టు కనిష్టంగా 16 నుంచి గరిష్టంగా 27 మంది వరకు తీసుకోవచ్చు. ఇందులో 9 మంది విదేశీ క్రికెటర్లు ఉండాలి.
 
 ఆటగాళ్ల కోసం ప్రతి ఫ్రాంచైజీ రూ. 60 కోట్లు ఖర్చు చేయాలి. ఆటగాళ్లను కొనసాగించుకునేందుకు ఖర్చయిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన డబ్బుతో ఫ్రాంఛైజీలు వేలానికి వెళతాయి.  
 వేలం మొత్తం ఈసారి రూపాయల్లో జరుగుతుంది.
 రూ. 2 కోట్లు కనీస ధర ఉన్న ఆటగాళ్లు 30 మంది. ఇందులో 11 మంది భారత ఆటగాళ్లున్నారు. అయితే తాజా జాబితాలో ప్యాటిన్సన్ పేరు లేదు.
 
 ఈ ధర ఉన్న 16 మందిని రెండు సెట్లుగా విభజించారు. నాణ్యమైన ఆటగాళ్ల జాబితా (ఎం)-1లో సెహ్వాగ్, యువరాజ్, పీటర్సన్, కలిస్‌లు ఉండగా, ఎం-2లో జాన్సన్, మెకల్లమ్, విజయ్, వార్నర్, బెయిలీ, డుప్లెసిస్, మైక్ హస్సీ, దినేశ్ కార్తీక్, జహీర్, మిశ్రా, స్యామీలు ఉన్నారు.
 
 మిగతా ఆటగాళ్లను వాళ్ల ప్రత్యేకతలను బట్టి బ్యాట్స్‌మెన్, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్, ఆల్‌రౌండర్, వికెట్ కీపర్ స్లాట్లుగా విభజించారు.
 
 కివీస్ తాజా సంచలనం కొరీ అండర్సన్‌కు ప్రీమియం ఆల్‌రౌండర్ జాబితాలో చోటు దక్కలేదు. కానీ పీటర్సన్ (ఇంగ్లండ్), అండర్సన్‌లపై అన్ని ఫ్రాంచైజీలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నాయి.
 
 బ్రిటిష్ పాస్‌పోర్ట్ కలిగిన పాక్ ఆటగాడు అజహర్ మహమూద్ ఆల్‌రౌండర్-1 స్లాట్‌లో ఉన్నాడు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల వేలం గురువారం జరిగే అవకాశం ఉంది.
 
 ఏ ఫ్రాంచైజీ ఎంత ఖర్చు పెట్టాలి ?  
 చెన్నై సూపర్ కింగ్స్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 5
 ఖర్చు చేసిన మొత్తం: రూ.39 కోట్లు
 అందుబాటులో ఉన్న మొత్తం: రూ. 21 కోట్లు)
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ఒక విదేశీ ఆటగాడిని తీసుకోవచ్చు.)
 
 ముంబై ఇండియన్స్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 5
 ఖర్చు చేసిన మొత్తం: రూ.39 కోట్లు
 అందుబాటులో ఉన్న మొత్తం: రూ. 21 కోట్లు)
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ఒక ఆటగాడిని తీసుకోవచ్చు)
 
 బెంగళూరు రాయల్ చాలెంజర్స్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 3
 ఖర్చు చేసిన మొత్తం: 29.5 కోట్లు
 అందుబాటులో ఉన్న మొత్తం: 30.5 కోట్లు)
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ఒక ఆటగాడిని తీసుకోవచ్చు)
 
 రాజస్థాన్ రాయల్స్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 5
 ఖర్చు చేసిన మొత్తం:రూ.37.5 కోట్లు
 అందుబాటులో ఉన్న మొత్తం: రూ.22.5 కోట్లు)
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ఒక ఆటగాడిని తీసుకోవచ్చు)
 
 ఢిల్లీ డేర్‌డెవిల్స్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 0
 ఖర్చు చేసిన మొత్తం: 0
 అందుబాటులో ఉన్న మొత్తం: రూ. 60 కోట్లు
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ముగ్గురు
 ఆటగాళ్లను తీసుకోవచ్చు)
 
 పంజాబ్ కింగ్స్ ఎలెవన్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 2
 ఖర్చు చేసిన మొత్తం: రూ. 16.5 కోట్లు
 అందుబాటులో ఉన్న మొత్తం: రూ. 43.5 కోట్లు
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవచ్చు)
 
 కోల్‌కతా నైట్‌రైడర్స్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 2
 ఖర్చు చేసిన మొత్తం:రూ. 22 కోట్లు
 అందుబాటులో ఉన్న మొత్తం: రూ. 38 కోట్లు)
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవచ్చు)
 
 హైదరాబాద్ సన్‌రైజర్స్
 కొనసాగిస్తున్న ఆటగాళ్ల సంఖ్య: 2
 ఖర్చు చేసిన మొత్తం: రూ. 22 కోట్లు
 అందుబాటులో ఉన్న మొత్తం: రూ. 38 కోట్లు)
 (‘రైట్స్ టు మ్యాచ్’ ద్వారా ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవచ్చు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement