ఈ రాత్రికి జైల్లోనే జయలలిత!
బెంగళూరు: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శుక్రవారం రాత్రికి తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైల్లోనే ఉంటారు. విడుదల కోసం లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆమె ఈ రాత్రికి జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం శనివారం ఉదయం జయ తరపు న్యాయవాది బి.కుమార్ లాంఛనాలు పూర్తి చేయనున్నారు.
ఇదిలా ఉండగా, కోర్టు ఉత్తర్వులపైనా, న్యాయమూర్తులపైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని జయలలిత కార్యకర్తలను కోరారు. కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని, ఎలాంటి ఉద్రిక్తతలకు చోటివ్వకూడదని జయలలిత విజ్క్షప్తి చేశారు.