సొంతగడ్డపై తొలి పోరు | mumbai indians and sun risers match starts to day in uppal stadium | Sakshi
Sakshi News home page

సొంతగడ్డపై తొలి పోరు

Published Mon, May 12 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

సొంతగడ్డపై తొలి పోరు

సొంతగడ్డపై తొలి పోరు

 నేడు ఉప్పల్‌లో ముంబైతో సన్‌రైజర్స్ మ్యాచ్
 సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే సన్‌రైజర్స్ సొంతగడ్డపై సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో సోమవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.
 
 ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్ 4 గెలిచి, 4 ఓడగా...ముంబై 2 గెలిచి, 6 ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఉప్పల్ స్టేడియంలో రైజర్స్‌కు చక్కటి రికార్డు ఉంది. గత సీజన్‌లో పెద్దగా భారీ స్కోర్లు నమోదు కాని ఇక్కడి పిచ్‌పై ఈ ఏడాది కూడా రైజర్స్ బౌలింగ్‌నే నమ్ముకుంది. మరో వైపు ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిలో పడాలని భావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement