‘ఫిక్సింగ్’ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆటగాళ్లకు ద్రవిడ్ సూచన
అహ్మదాబాద్: ఐపీఎల్-7లో స్పాట్‌ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి వివాదాలేవీ లేకుండా టోర్నీ సాఫీగా సాగిపోతుండడం పట్ల రాజస్థాన్ రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఆటగాళ్లు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు.
‘ఎటువంటి వివాదాలకు తావులేకుండా లీగ్ కొనసాగుతుండడం సంతోషకరం. కానీ, క్రికెట్‌ను దెబ్బతీయాలని చూసే వ్యక్తులూ ఉన్నందున ఆటగాళ్లు, జట్లు అప్రమత్తంగా ఉండాలి’ అని ద్రవిడ్ అన్నాడు. ఈ ఏడాది రాజస్థాన్‌కు సొంత వేదికగా ప్రకటించిన అహ్మదాబాద్ తమకు కలిసివచ్చే వేదికేనని, గతంలో ఇక్కడ తమ జట్టుకు మంచి రికార్డే ఉందని ద్రవిడ్ తెలిపాడు.