వన్డే వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్ తేదీ మార్పు జరుగనుందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దేవీ నవరాత్రుల ప్రారంభ తేదీ (అక్టోబర్ 15) కావడంతో భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్డ్ తేదీ కంటే ఒక రోజు ముందే జరుగుతుందన్న ప్రచారం నడుస్తుండగానే.. నవంబర్ 12న జరగాల్సిన పాకిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు ఉంటుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది.
పాక్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు వేదిక అయిన కోల్‌కతాలో నవంబర్ 12న కాళీ పూజ ఘనంగా జరుగనుండటంతో, ఆ రోజు పాక్ మ్యాచ్ నిర్వహిస్తే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు (క్యాబ్) లేఖ రాసారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశాన్ని క్యాబ్ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ కొట్టిపారేయడం విశేషం. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో స్నేహశిష్ మాట్లాడుతూ.. కోల్‌కతా పోలీసుల నుంచి తమకు ఎలాంటి లేఖ రాలేదని చెప్పారు. ఒక వేళ ఇలాంటిది ఏమైనా ఉంటే పరిశీలిస్తామని అన్నారు.
ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
- అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై)
- అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
- అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) (ఈ మ్యాచ్ ఒక రోజు ముందే జరగవచ్చు)
- అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే)
- అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల)
- అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో)
- నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై)
- నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా)
- నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు)
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వబోయే మ్యాచ్‌లు ఇవే..
- అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-1
- అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1
- అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2
Comments
Please login to add a commentAdd a comment