
టీమిండియా ప్రాక్టీస్ లో గంగూలీ
కోల్ కతా: భారత్ క్రికెట్ జట్టు శుక్రవారం ఈడెన్ గార్డెన్ ముమ్మర సాధన చేసింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణ ఆటగాళ్లు సాధన చేశారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా రేపు(శనివారం) జరిగే కీలక మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి.
మరోవైపు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈడెన్ గార్డెన్ లో టీమిండియా ప్రాక్టీస్ ను స్వయంగా పర్యవేక్షించాడు. ఆటగాళ్లకు సలహాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా గంగూలీని యువరాజ్ సింగ్ అప్యాయంగా హత్తుకున్నాడు. అశిష్ నెహ్రా, హర్భజన్, యువరాజ్, రవిశాస్త్రితో గంగూలీ సమాలోచనలు జరిపాడు.