కొంచెం కష్టంగా ఉంది: షారుఖ్‌ కూతురు | Suhana Khan On Trolls Not honestly say that I Do Not get Upset | Sakshi
Sakshi News home page

మనస్పూర్తిగా చెప్పలేక పోతున్నా: షారుఖ్‌ కూతురు

Published Wed, Aug 1 2018 11:24 AM | Last Updated on Wed, Aug 1 2018 11:56 AM

Suhana Khan On Trolls Not honestly say that I Do Not get Upset - Sakshi

సుహానా ఖాన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ గారాల పట్టీ సుహానా ఖాన్‌(18) సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సుహానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో టూ పీస్‌ బికినీ ఫోటోను అప్‌లోడ్‌ చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ పిక్‌ హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్‌ చిన్న కొడుకు అబ్‌రామ్‌ కూడా ఉండటంతో ఆమెపై పలువురు ఘాటుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా సుహానా ఓ మ్యాగ్‌జైన్‌ ఇంటర్వ్యూలో స్పందించారు.

‘ఇంట్లో బానే ఉంది. కానీ బయటే కొంచెం కష్టంగా ఉంది. ప్రజలు ఏదైనా నిర్ణయిస్తామనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ దోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా ప్రయివేట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి లీకయ్యాయి. చాలా మంది వాటి గురించి మాట్లాడుతున్నారు. వారికేం తెలియకున్నా.. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శించే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఈ విమర్శలతో నేను బాధపడటం లేదు అని మనస్పూర్తిగా చెప్పలేకపోతున్నా. ఇది చాలా బాధను కలిగిస్తోంది. విమర్శించే వారికి నేనో పెద్ద సమస్యగా మారాను’ అని సుహాన ఆవేదన వ్యక్తం చేసింది. 

చదవండి: సుహానా..‘నీకసలు సిగ్గుందా?’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement