The Archies Movie Will Be Released On The Ott Platform Netflix, Deets Inside - Sakshi
Sakshi News home page

తండ్రి నిర్మాత.. కుమార్తె కథానాయిక

Published Tue, Jun 27 2023 1:55 AM | Last Updated on Tue, Jun 27 2023 10:34 AM

The Archive movie will be released on the OTT platform - Sakshi

‘అలాంటి ఇలాంటి లాంచింగ్‌ కాదు.. ఓ రేంజ్‌లో ఉండాలి’ అన్నట్లు కుమార్తె సుహానా ఖాన్‌ వెండితెర అరంగేట్రానికి షారుక్‌ ఖాన్‌ రంగం సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే సుహానా నటిగా మేకప్‌ వేసుకుంది. జోయా అక్తర్‌ దర్శకత్వంలో ‘ది ఆర్చీస్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈలోపు సుహానా వెండితెరపై పరిచయం కావడానికి ఓ సినిమా సైన్‌ చేసిందని సమాచారం. కుమార్తె అరంగేట్రం అట్టహాసంగా జరగాలనే ఆలోచనతో తనకు ఇటీవల ‘పఠాన్‌’లాంటి హిట్‌ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలని షారుక్‌ అనుకుంటున్నారట. అది మాత్రమే కాదు.. అతిథి పాత్ర కూడా చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కథ రెడీ అవుతోందని సమాచారం. ఇంకా దర్శకుడి ఎంపిక జరగలేదని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement