గర్వంగా ఫీల్‌ అవుతున్నా: షారూఖ్‌ | Shah Rukh Khan: Being A Father Is Greatest Source Of Pride | Sakshi
Sakshi News home page

అబ్రామ్‌ డ్రాయింగ్‌; షారూఖ్‌ ప్రశంస

Published Mon, Mar 2 2020 12:19 PM | Last Updated on Mon, Mar 2 2020 12:58 PM

Shah Rukh Khan: Being A Father Is Greatest Source Of Pride - Sakshi

ముంబై : పిల్లలు చేసే చిన్న చిన్న పనులే తల్లిదండ్రులకు కొత్త అనుభూతినిస్తాయి. వాళ్ల చిట్టి చేతులతో ఏం చేసినా మురిసిపోతుంటారు. అయితే సెలబ్రిటీలు వారి బిజీ షెడ్యూల్‌లో పడి పిల్లలను ఏం పట్టించుకుంటారులెండి అని అనుకోకండి. ఎంత సంపాదించినా పిల్లలకు మించిన ఆస్తి మరొకటి లేదనుకుని బతికేవారు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో షారుక్‌​ ఖాన్‌ ముందు వరుసలో ఉంటాడు. కాగా షారుక్‌ కొడుకు అబ్రామ్‌, కరీనా- సైఫ్‌ కొడుకు తైమూర్‌, ఐశ్వర్యరాయ్‌- అభిషేక్‌ బచ్చన్‌ కూతురు ఆరాధ్య బచ్చన్‌.. వీళ్లకు ఇప్పటికే జనాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. చిన్న వయస్సులోనే సెలబ్రిటీలుగా మారి అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా షారుక్‌ తన గారాల కొడుకు అబ్రామ్‌ చేసిన ఓ పనికి తెగ సంబరపడిపోతున్నాడు. అబ్రామ్‌, పప్పా అని రాసి ఇద్దరి బొమ్మలను గీయగా  దీన్ని షారుక్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఓ తండ్రిగా నాకు గర్వంగా ఉందంటూ అబ్రామ్‌ డ్రాయింగ్‌ను ప్రశంసించాడు. 

నేను గర్వంగా ఫీల్‌ అవడానికి నా కొడుకు ఓ కారణం. తన వినయం, ప్రేరణ, విజయం నాకు ఎన్నో నేర్పాయి. డ్రాయింగ్‌లో నేను ఏ కారణం లేకుండా నవ్వుతున్నానంటా. అందుకే నా కొడుకు కంటే నేను బాగా కనిపిస్తున్నానని అబ్రామ్‌ చెప్పాడు’ అని పేర్కొన్నాడు. ఇక కింగ్‌ఖాన్‌ షారుక్‌ తన కొడుకును ప్రశంసించడం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే తన పెద్ద కొడుకు ఆర్యన్‌, కూతురు సుహానా సాధించిన విజయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవవల టైక్వాండో టోర్నమెంట్‌లో సాధించిన బంగారు పథకాన్ని కూడా అభిమానులతో పంచుకున్నాడు. (చదవండి: ఆయన మొదటి జీతం ఎంతో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement