
గౌరీ ఖాన్- షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు షారుఖ్ చాలా ఓపికగా సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
‘మీరెందుకు సార్ అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు’ అంటూ అభిమాని ప్రశ్నించగా.. ‘భాయ్.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా వస్తాయి. అయితే నా విషయంలో ఈ రెండు గౌరీ రూపంలో ఒకేసారి వచ్చేశాయి’ అంటూ తాను అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పారు. షారుఖ్ సమాధానానికి ఫిదా అయిన నెటిజన్లు.. ‘కింగ్ ఆఫ్ రొమాన్స్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని, గౌరీపై తనకు ఉన్న ప్రేమని ఎంత హృద్యంగా చెప్పారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా టీవీ షోలు చేస్తున్న సమయంలోనే షారుఖ్ ఖాన్ గౌరీని ప్రేమించారు. సినిమాల్లో అంతగా గుర్తింపు పొందకముందే 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ జంటగా పేరొందిన వీరికి ఆర్యన్, సుహానా, అబ్‌రాం అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment