‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’ | Aryan Khan Shares A Cute Pic With Little Brother Abram | Sakshi
Sakshi News home page

‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’

Published Sat, Jul 7 2018 3:13 PM | Last Updated on Sat, Jul 7 2018 5:57 PM

Aryan Khan Shares A Cute Pic With Little Brother Abram - Sakshi

తమ్ముడు అబ్‌రామ్‌తో ఆర్యన్‌ ఖాన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కుటుంబం ప్రస్తుతం సెలవుల్లో భాగంగా యూరప్‌ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు షారుఖ్‌ పిల్లలు.  ట్రిప్‌లో భాగంగా నేపుల్స్‌ చేరుకున్న సందర్భంగా షారుఖ్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తన చిన్నారి సోదరుడు అబ్‌రామ్‌తో కలిసి దిగిన ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అబ్‌రామ్‌మై చెయ్యి వేసి నిల్చున్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఆర్యన్‌... ‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’  అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.  దీనికి స్పందించిన నెటిజన్లు ‘ఒక పెద్దన్న ఎలా ఉంటారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. మీ సోదరులిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు.

చెల్లెలు సుహానా ఖాన్‌తో పోలిస్తే సోషల్‌ మీడియాలో ఆర్యన్‌ కాస్త అరుదుగానే ఫొటోలు పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. కానీ అప్‌లోడ్‌ చేసిన ప్రతిసారీ తండ్రి లాగే చమత్కారంతో కూడిన కామెంట్లతో ఆకట్టుకుంటాడు. గతంలో అబ్‌రామ్‌ను తలకిందులుగా వేలాడదీస్తూ పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసిన ఆర్యన్‌.. ‘హ్యాంగింగ్‌ ఔట్‌ విత్‌ బ్రదర్‌’ అంటూ చమత్కరించాడు.

Nobody lays a hand on my brother.

A post shared by Aryan Khan (@___aryan___) on

Hanging out with the brother

A post shared by Aryan Khan (@___aryan___) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement