
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేయకపోయినా.. తన స్టైలిష్ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు. తాజాగా సుహానా అదిరే స్టెప్పులు వేసిన షార్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్ నటించిన ‘ద ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్’ థీమ్ సాంగ్‌కు షారుఖ్ తనయ స్టైలిష్‌గా స్టెప్పులు వేశారు. త్వరలోనే హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాలనుకుంటున్న ఈ స్టార్ కిండ్ ప్రస్తుతం సుహానా ఇంగ్లండ్‌లో చదువుతున్నారు. చదువు ముగిసిన తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment