
ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్.. సోషల్ మీడియాలో మరోసారి హల్‌చల్ చేస్తోంది. స్విమ్‌సూట్‌లో ఉన్న సుహానా ఖాన్ తాజా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
‘ఫ్యూచర్ బాలీవుడ్’ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఓ గుర్తుతెలియని ఐడీ ఈ ఫొటోలను పోస్టు చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో సుహానా తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు, ఓ వీడియోను ఈ పేజీ షేర్‌చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వెంటనే వైరల్‌గా మారిపోయాయి.
సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందని తెలుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుక్ తనయ ఫొటోలు ఎప్పుడూ సోషల్‌మీడియాలో కనిపించినా వైరల్ అవుతూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment