
బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. అసలే సుహానా ఖాన్ ఈ మధ్య నెట్టింట్లో హీట్ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ కిడ్‌గా నటనలో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తన చదువు పూర్తయ్యాకే.. సినిమాల్లో నటిస్తుందని బాద్‌షా తేల్చి చెప్పేశాడు.
అయితే తన కూతురి చదువు పూర్తయిందని అసలు ప్రపంచంలోకి ఇప్పుడే అడుగు పెట్టిందని, ముగిసింది స్కూలే.. నేర్చుకోవడం కాదంటూ సుహానాకు సలహాలు ఇస్తున్నాడు షారుఖ్. ‘నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆర్డింగ్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. చివరి పిజ్జా.. చివరి రైలు ప్రయాణం.. నిజమైన ప్రపంచంలోకి తొలి అడుగు పడింది ఇప్పుడే. ముగిసింది స్కూలే.. నేర్చుకోవడం కాదు’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ మధ్య వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సుహానా ఫొటో సెషన్‌లో పాల్గొంది. అప్పట్లో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
4 yrs have flown by. Graduating from Ardingly. Last pizza...last train ride...and first step into the real world...school ends...learning doesn’t. pic.twitter.com/hKHPIj0ffe
— Shah Rukh Khan (@iamsrk) June 28, 2019
Comments
Please login to add a commentAdd a comment