
న్యూ ఇయర్ పార్టీతో దుమ్మురేపిన స్టార్ కిడ్స్!
ముంబై: కింగ్ ఖాన్ షారుఖ్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో రోజురోజుకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతోంది. తన తండ్రి 51వ జన్మదిన వేడుకల్లో రెడ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించి.. మీడియా దృష్టిని ఆకర్షించిన ఈ టీనేజర్ తాజాగా నూతన సంవత్సర వేడుకలతో దుమ్మురేపింది. తన గ్యాంగ్‌ను వేసుకొని ముంబై సబర్బన్‌లోని ఓ హాట్‌స్పాట్‌లో న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేసింది.
ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు పలువురు పాల్గొన్నారు. భవిష్యత్తులో బాలీవుడ్ తెరపై కనిపించే అవకాశమున్న స్టార్ కిడ్స్ అంతా ఇలా న్యూఇయర్ ఎంజాయ్ చేయడమే కాకుండా ఆహార్ పాండే జన్మదిన వేడుకల్ని కూడా నిర్వహించారు. ఈ పార్టీకి బ్లాక్ డ్రెస్‌తో అటెండ్ అయిన సుహానా ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వీరి పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.