![Suhana khan Reaction On Her Skin Tone, Tells She Has Been Called Ugly - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/30/saha.gif.webp?itok=YV6qM43-)
సుహానా ఖాన్.. సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల ముద్దుల కూతురు. బీటౌన్ స్టార్ నటుడి కుమార్తె అయినప్పటికీ తనకూ ట్రోలింగ్స్ బెడద తప్పలేదు. తాజాగా తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్‌పై సుహానా స్పందించారు. తన శరీరపు రంగుపై కామెంట్లు చేస్తున్న వారికి ధీటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం సుహానాకు 20 ఏళ్లు,. అయితే 12వ ఏట నుంచే తన శరీరపు రంగు గురించి చెడుగా మాట్లాడుతున్నారని ఆమె వెల్లడించారు. ‘నువు అస్సలు బాగోలేవు, నల్ల పిల్లిలా, మంత్రగత్తెలా ఉన్నావు అంటూ పలువురు నెటిజన్లు తనపై తీవ్ర వివక్షత చూపుతున్నారని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్ తనయ!)
"ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఈ సమస్య నాకు మాత్రమే కాదు. అందరికి ఎదురవుతోంది. దీనిని మనం తప్పక పరిష్కరించుకోవాలి. నాపై చేసిన కొన్ని వ్యాఖ్యలను మీకు చెబుతాను. నాకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి నా శరీర రంగు గురించి ఎంతో మంది ఎన్నో కామెంట్లు చేశారు. నా స్కిన్ టోన్ బాలేదని, చూడటానికి అసహ్యంగా ఉన్నానాని అన్నారు. విచారకరమైన విషయం ఏంటంటే మనమంతా భారతీయులం. ఒక్కోక్కరు ఒక్కో రంగులో ఉంటారు. కొందరు తెల్లగా, మరి కొందరు గోధుమ రంగులో కానీ మనం వేర్వేరు రంగులో ఉన్నప్పటకీ సొంత వారిని అసహ్యించుకోవడం బాధాకరం. మీరు 5"7, ఫెయిర్‌గా లేకుంటే మీరు అందంగా లేరని కాదు. నా ఎత్తు 5’’3.. నా కలర్ బ్రౌన్.. నేను ఇలా ఉన్నందుకు ఎప్పుడూ బాధపడను. నిజానికి చాలా సంతోషంగా ఉన్నాను. అంటూ ట్రోట్స్‌ను తప్పికొట్టారు. (లైంగిక వేధింపులు: బాలీవుడ్ దర్శకుడికి సమన్లు)
Comments
Please login to add a commentAdd a comment