ugly
-
ఆ ఫౌంటెన్ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..
అప్పుడప్పుడు కొన్ని పనులు మిస్‌ఫైర్ అవుతుంటాయి. అలా ఆస్ట్రేలియాలోనూ ఓ సంఘటన జరిగింది. దాదాపు రూ. పదహారు కోట్లు ఖర్చు పెట్టి, అక్కడి ప్రభుత్వం ఒక అందమైన వాటర్ ఫౌంటెన్‌ను సిటీ మధ్యలో నెలకొల్పితే.. అదికాస్త ఈ ప్రపంచంలోనే అత్యంత చెత్త వాటర్ ఫౌంటెన్‌గా మారింది. ప్రముఖ ఆర్ట్ గ్రూప్ ‘గెలిటిన్’ డిజైన్ చేసిన ఈ ఫౌంటెన్.. ఇప్పటి వరకు వారు డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్స్ అన్నిటికంటే ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది. ‘ప్రచారం చేసినట్లుగా 150 సంవత్సరాల వియన్నా చరిత్ర, ఆధునిక నీటి వ్యవస్థ, నీరు – సామాజిక బాధ్యత.. వంటి విషయాలు ఈ డిజైన్‌లో ఎక్కడ ప్రతిబింబించాయి?’ అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. పైగా ఇందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడాన్నీ తప్పుబడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫౌంటెన్ విపరీతంగా ట్రోల్స్ కావడంతో ఈ మధ్యనే గెలిటిన్ ‘అందం చూసే వారి కళ్లల్లో ఉంటుంది’ అని స్పందించింది. ‘వారు అన్నమాట నిజమే కానీ, అందాన్ని ఎవరి కళ్లూ చూడలేకపోతే అది చూసేవారి తప్పు కాదుకదా!’ అంటూ పెదవి విరుస్తున్నవారూ లేకపోలేదు. (చదవండి: అరటిపండుతో తయారు చేసిన సుత్తి! ఎలాగో వింటే షాకవ్వుతారు) -
ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!
ఇటీవల కుక్కలు, పిల్లుల్లో అసహ్యమైన వాటిని గుర్తించి అవే ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైనవిగా పేర్కొనడం గురించి విన్నాం. ఐతే ఇలా వెల్లడించేది అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సోసైటీ. ఇపుడు ఆ కోవలోకి ఓ చేప వచ్చింది. ఇదేంటి చేపల్లో కూడా అసహ్యమైనవి ఉంటాయా! అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఔను ఓ వికారమైన చేప ఉందంటా. దీన్ని చూస్తేనే భయపడతామని చెబుతున్నారు పరిశోధకులు. ఈ చేప పేరు 2003లో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. కానీ ఇది రియల్ కాదనే అనుకున్నారు అంతా. ఐతే అలాంటి వింత చేప ఉందని, అదే అత్యంత అసమస్యమైనదని శాస్త్రవేత్తలు చెప్పడం విశేషం. ఈ చేప ఆకారం పలు ఎమోజీల్లో కూడా ఉంటుంది. అయితే ఈ అత్యంత అసహ్యకరమైన చేపను తొలిసారిగా 1983లో న్యూజిలాండ్ తీరంలో ఓ పరిశోధన నౌక దీన్ని కనుగొంది. ఇవి సముద్రంలో సుమారు 600 నుంచి 1200 మీటర్ల అడుగుల లోతుల్లో సంచరిస్తుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పీడనం అధికంగా ఉండే అడుగున ఇవి ఉండటం కారణంగా వీటి ఎముకలు, కండరాలతో కూడిన మెత్తని శరీరంతో చూసేందుకు వికారంగా ఉంటాయన్నారు. శాస్త్రవేత్తలు దీన్ని బ్లాబ్ ఫిష్ అని పిలుస్తారు. ఇది సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్ కుటుంబానికి చెందడం వల్ల దీని శాస్త్రీయ నామం కూడా అలానే(సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్) వ్యవహరించారు పరిశోధకులు. అయితే దీన్ని బయటకు తీస్తే ఒత్తడి తక్కువుగా ఉండటం వల్ల దీని శరీరం విస్తరించినట్లుగా అయ్యి రిలాక్స్డ్ మోడ్‌లో ఉండి ముక్కు బయటకు వచ్చి ఉంటుంది. అదే సముద్రం అడుగున మాత్రం అధిక పీడనం కారణంగా అది మొత్తం ముడిచుకుపోయినట్లు ఓ జెల్లీ ఫిష్ మాదిరిగా కనిపిస్తుందిన చెప్పుకొచ్చారు. అయితే దీన్ని చూసిన వెంటనే..దాని వింత ఆకరం కారణంగా భయపడటం జరుగుతుందని అన్నారు. అందువల్లే అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీ దీన్ని ప్రంపచంలోనే అత్యంత వికారమైన బ్లాబ్ ఫిష్‌గా పేర్కొన్నట్లు తెలిపారు. (చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..) -
పరమ చెత్త కుక్క..!
కాలిఫోర్నియా: చైనా జాతికి చెందిన ఒక కుక్క ప్రపంచంలో పరమ చెత్తగా, అందవిహీనంగా కనిపించే కుక్కగా కిరీటం సాధించింది. ప్రతీ ఏడాది అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే అందవిహీనమైన శునకాల పోటీలో స్కూటర్ అనే పేరు ఉన్న ఏడేళ్ల వయసు శునకానికి ఈ పురస్కారం దక్కింంది. అవార్డు కింద ఒక ట్రోఫి, 1500 డాలర్లు బహుమానాన్ని ఆ కుక్కని పెంచుతున్న యజమానురాలికి ఇచ్చారు. కుక్కల పెంపకం, వాటిలో లోపాలున్న ప్రేమను పంచడం, జంతుప్రేమపై అవగాహన పెంచడం కోసం సొనొమా –మారిన్ ఫెయిర్‌లో ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి. -
ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ
Mr Happy Face Winner: పలు దేశాల్లో చాలా చాలా వింత వింత పోటీలు జరుగుతుంటాయి. ఇవేం పోటీలు అన్నంత విచిత్రంగా ఉంటాయి. అందమైన కుక్కల పోటీలు లేదా చురుకైన లేక తెలివైన కుక్కల కాంపిటీషన్ వంటి విచిత్రమైన పోటీలు గురించి విన్నాం. అంతేగానీ అత్యంత అసహ్యంగా ఉండే శునకాల పోటీ గురించి విన్నారా! ఔను అత్యంత వికారంగా ఉంటే శునకాల పోటీ కూడా ఉందటా. పైగా ఏటా భారీ ఎత్తున నిర్వహిస్తారట! అమెరికాలో ఆరిజోనాకు చెందిన 17 ఏళ్ల చివావా మిక్స్ అనే కుక్క.. ప్రపంచంలోనే అత్యంత అంద విహీనమైన కుక్కగా ఎంపికైంది. కాలిఫోర్నియాలో సోనోమా మారిన్ఫెయిర్ సందర్భంగా మిస్టర్ హ్యాపీ ఫేస్ అను అత్యంత అసహ్యమైన కుక్కల కాంపిటీషన్ జరుగుతుంది. ఐతే దాదాపు 50 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారీ కారణంగా రెండేళ్ల తదనంతరం, మళ్లీ ఇప్పుడు ఈ పోటీని నిర్వహించారు. ఆ కుక్క ముఖమంతా కణితులు, పైగా నరాల సంబంధిత వ్యాధితో నుంచోలేని అత్యంత దీనావస్థలో ఉంది. ఆ కుక్కకథ.. ఆ పోటీలు నిర్వహిస్తున్న న్యాయ నిర్ణేతలను కదిలించడంతో విజేతగా ప్రకటించారు. అంతేకాదు ఈ పోటీలో పాల్గొన్న మిగతా ఎనిమిది కుక్కలను వెనక్కినెట్టి మరీ విజేతగా నిలివడం విశేషం. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ కుక్క సంతోషంగా ఉన్నప్పుడు డీజిల్ ట్రక్లాంటి చిన్న శబ్దాన్ని కూడా చేస్తుందట. యజమాని జెనెడా బెనెల్లీ ఆరిజోనాలో ఆశ్రయం పొందుతున్న ఈ కుక్కని 2021లో దత్తత తీసుకున్నాడు. అప్పుడు ఈకుక్క డైపర్ వేసుకుని కణుతులతో ఉండి దారుణమై ఆరోగ్య సమస్యలతో దీనస్థితిలో ఉందని పేర్కొన్నాడు. ఐతే ఈ కుక్క ప్రస్తుతం ఒక నెల మాత్రమే జీవించగలదని యజమాని జెనెడా చెబుతున్నాడు. ఈ కుక్క ఈ పోటీలో విజేతగా నిలవడంతో సుమారు రూ. లక్షరూపాయాల ప్రైజ్‌మనీ తోపాటు న్యూయార్క్ సిటీని చుట్టివచ్చే అవకాశాన్ని కూడా పోందింది. పేరుకే ఇది అత్యంత అందవిహీనమైనం కావొచ్చు.. కానీ, దానంత అందమైన జీవితం మరొకటి లేదంటున్నారు పలువురు నెటిజన్స్. (చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...) -
ట్రోలింగ్; నువ్వు అసహ్యంగా ఉన్నావ్
సుహానా ఖాన్.. సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ల ముద్దుల కూతురు. బీటౌన్ స్టార్ నటుడి కుమార్తె అయినప్పటికీ తనకూ ట్రోలింగ్స్ బెడద తప్పలేదు. తాజాగా తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్‌పై సుహానా స్పందించారు. తన శరీరపు రంగుపై కామెంట్లు చేస్తున్న వారికి ధీటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం సుహానాకు 20 ఏళ్లు,. అయితే 12వ ఏట నుంచే తన శరీరపు రంగు గురించి చెడుగా మాట్లాడుతున్నారని ఆమె వెల్లడించారు. ‘నువు అస్సలు బాగోలేవు, నల్ల పిల్లిలా, మంత్రగత్తెలా ఉన్నావు అంటూ పలువురు నెటిజన్లు తనపై తీవ్ర వివక్షత చూపుతున్నారని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్ తనయ!) "ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఈ సమస్య నాకు మాత్రమే కాదు. అందరికి ఎదురవుతోంది. దీనిని మనం తప్పక పరిష్కరించుకోవాలి. నాపై చేసిన కొన్ని వ్యాఖ్యలను మీకు చెబుతాను. నాకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి నా శరీర రంగు గురించి ఎంతో మంది ఎన్నో కామెంట్లు చేశారు. నా స్కిన్ టోన్ బాలేదని, చూడటానికి అసహ్యంగా ఉన్నానాని అన్నారు. విచారకరమైన విషయం ఏంటంటే మనమంతా భారతీయులం. ఒక్కోక్కరు ఒక్కో రంగులో ఉంటారు. కొందరు తెల్లగా, మరి కొందరు గోధుమ రంగులో కానీ మనం వేర్వేరు రంగులో ఉన్నప్పటకీ సొంత వారిని అసహ్యించుకోవడం బాధాకరం. మీరు 5"7, ఫెయిర్‌గా లేకుంటే మీరు అందంగా లేరని కాదు. నా ఎత్తు 5’’3.. నా కలర్ బ్రౌన్.. నేను ఇలా ఉన్నందుకు ఎప్పుడూ బాధపడను. నిజానికి చాలా సంతోషంగా ఉన్నాను. అంటూ ట్రోట్స్ను తప్పికొట్టారు. (లైంగిక వేధింపులు: బాలీవుడ్ దర్శకుడికి సమన్లు) View this post on Instagram There's a lot going on right now and this is one of the issues we need to fix!! this isn't just about me, it's about every young girl/boy who has grown up feeling inferior for absolutely no reason. Here are just a few of the comments made about my appearance. I've been told I'm ugly because of my skin tone, by full grown men and women, since I was 12 years old. Other than the fact that these are actual adults, what's sad is that we are all indian, which automatically makes us brown - yes we come in different shades but no matter how much you try to distance yourself from the melanin, you just can't. Hating on your own people just means that you are painfully insecure. I'm sorry if social media, Indian matchmaking or even your own families have convinced you, that if you're not 5"7 and fair you're not beautiful. I hope it helps to know that I'm 5"3 and brown and I am extremely happy about it and you should be too. #endcolourism A post shared by Suhana Khan (@suhanakhan2) on Sep 29, 2020 at 9:10am PDT -
'ఏ తల్లీ చేయకూడని దౌర్భాగ్యపు పని చేసింది'
వాషింగ్టన్: ప్రపంచంలో ఏ తల్లి కూడా చేయకూడని దౌర్భాగ్యపు పనిని అమెరికాలో ఓ తల్లి చేసింది. అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించి మాతృత్వం అనే మాటకు అర్థం లేకుండా చేసింది. పసివయసు కూడా దాటని తన ఆరేళ్ల కూతురును చెరిచేయండి అంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా, ఆరేళ్ల కూతురుపైనే అత్యాచారం చేయించి చివరకు కటకటాల పాలైంది. కోర్టు ఆమెకు 26 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఓ 35 ఏళ్ల తల్లి డబ్బు చెల్లించేవారు ఎవరైనా తన కూతురుని అనుభవించేందుకు రావొచ్చని ఆన్ లైన్లో ప్రకటనలు చేసింది. అంతేకాకుండా కూతురుపై దారుణంగా అత్యాచారం చేయించి ఫొటోలు, వీడియోలు తీయించింది. ఈ విషయం చివరకు పోలీసులకు తెలిసి ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించగా పలు విస్మయకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నో అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు, ఆ బాలికపై లైంగిక దాడి జరుగుతుండగా ఆమె పక్కనే ఉండి చూస్తున్నట్లుగా ఉన్న వీడియోలకు సంబంధించిన ఫుటేజీలు సొంతం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళను జైలుకు తరలించి విచారించగా ఆమె ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదని, గతంలో 12 లైంగిక నేరాలకు పాల్పడిందని, చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేయించిందని తెలిసింది. అయితే, కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఈ దారుణాలకు ఒడిగట్టిన ఆమె పేరు మాత్రం కోర్టు బయటకు చెప్పొద్దని ఆదేశించింది. అలా చెప్పడం వల్ల ఆ బాలిక ఎవరో సమాజానికి తెలిసిపోతుందని, చిన్నారి మనుగడకు ఇబ్బంది అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆమె భర్తకు కూడా ఇలాంటి నేరాల కింద 27 ఏళ్లపాటు జైలు శిక్ష పడింది. -
మిస్టర్ కురూపి అతడు కాదు.. నేనే
హరారే: జింబాబ్వే రాజధాని హరారేలో పీజెంట్ అనే పబ్ అందవికారంగా ఉండే వాళ్లకూ పోటీలు నిర్వహించి ‘మిస్టర్ అగ్లీ’ టైటిల్‌తోపాటు 500 డాలర్లు (రూ.33వేలు) నగదు బహుమతి ఇస్తోంది. మిస్టర్ కురూపి.. ఏమాత్రం అందంగా లేకుండా, అత్యంత అందవిహీనంగా ఉండేవాళ్లను ఎంపిక చేసేందుకు పెట్టిన పోటీ ఇది. 'జింబాబ్వే మిస్టర్ అగ్లీ 2015' అనే పేరుతో పెట్టిన ఈ పోటీలో 42 ఏళ్ల మిసన్ సెరె అనే వ్యక్తి గెలిచాడు. అయితే.. అతడి కురూపితనం సహజంగా వచ్చినది కాదని, అతడికంటే తానే పెద్ద కురూపినని ఈ పోటీలో రన్నరప్‌గా వచ్చిన విలియం మస్విను ఆరోపిస్తున్నాడు. మిసన్ సెరెకి పళ్లు ఊడటం వల్లే అతడు కురూపిగా కనిపించాడు తప్ప.. నిజానికి అతడు అందగాడేనని మండిపడుతున్నాడు. 'నేనే అందంగా లేను... నేను సహజమైన కురూపిని. అతడికి పళ్లు ఊడటం వల్లే టైటిల్ గెలుచుకున్నాడు. నేను ఇంతకుముందు వరుసగా మూడుసార్లు ఈ టైటిల్‌ను గెలవడంతో పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు నా జీవితమే పూర్తిగా మారిపోయింది' అని రన్నరప్ విలియం మస్వినూ అన్నాడు. ఈ పోటీల్లో అతను100 డాలర్ల ప్రైజ్ మనీ గెలుపొందాడు. ఈ టైటిల్ గెలుచుకోవడానికి పళ్లు ఊడగొట్టుకోమంటారా అని మరో పోటీదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. న్యాయనిర్ణేతలు ఇచ్చిన తీర్పును అందరం గౌరవించాలని అగ్లీ పోటీల విజేత మిసన్ సెరె అన్నాడు. మరి అతడికి ఏకంగా 500 డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. ఈ పోటీలను జింబాబ్వేకే పరిమితం చేయకుండా, ప్రపంచస్థాయిలో 2017 నుంచి 'మిస్టర్ అగ్లీ వరల్డ్'ని ప్రారంభించే యోచనలో ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు.