
కోల్‌కతా : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 11లో శుభారంభం చేసింది. అయితే ఆదివారం రాత్రి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సుహానా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సుహానా ఎవరంటారా.. కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ముద్దుల తనయ. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు వచ్చి షారుక్ చిన్న కుమారుడు అబ్‌రామ్ మైదానంలో సందడి చేశాడు. ఈసారి బుడ్డోడు అబ్‌రామ్, సుహానాఖాన్‌లతో తండ్రి షారుక్ స్డేడియానికి వచ్చి మ్యాచ్ ఆస్వాదించారు.
అసలే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుందన్న ఊహాగానాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో సుహానా బెంగళూరుతో కేకేఆర్ మ్యాచ్ చూసేందుకు వచ్చి అట్రాక్షన్‌గా నిలిచారు. తొలుత కేకేఆర్ ఆటగాళ్లు బౌలింగ్‌లో వికెట్లు తీస్తుంటే సంతోషించిన సుహానా తండ్రి షారుక్‌తో కలిసి తమ జట్టుకు మద్దతు తెలిపింది. ఆపై ఛేజింగ్ సమయంలో తమ బ్యాట్స్‌మెన్ ఔటయిన సందర్భాల్లో ఆశ్చర్య పోతున్నట్లు, విచారం వ్యక్తం చేస్తున్నట్లు కనిపించి తన హావభావాలతో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించిన సుహానా తండ్రి షారుక్‌తో కలిసి వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదించారు. త్వరలోనే సుహానాను వెండితెరపై చూస్తామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment