బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ అంటే అభిమానులు పడి చస్తారు. సంవత్సరాలుగా సూపర్‌స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఆయన కొత్తతరం సినిమాకు, ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కు ఒక కొత్త కళను తీసుకొచ్చారు. ఇప్పటికీ షారూక్ హవా అలా కొనసాగుతూనే ఉంటే, ఆయన వారసులు కూడా త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్. రేపో, మాపో హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తాడని కూడా అంటున్నారు. ఆర్యన్‌తో పాటు షారూక్ కూతురు సుహానా ఖాన్ కూడా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. కొద్దికాలంగా సుహానా ఫోటోషూట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆమెకూ క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా షారూక్ భార్య గౌరీఖాన్.. సుహానా ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు..’’ అంటూ ఒక పార్టీకి హాజరైన కూతురు ఫొటోను పోస్ట్ చేసింది గౌరి. ఈ ఫొటోలో ట్రెండీ లుక్‌లో, స్టైలిష్‌గా, బాలీవుడ్ హీరోయిన్ లెవెల్లో పోజులిచ్చింది సుహానా! పక్కాగా ఫ్యూచర్‌లో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ సుహానాకు ఉన్నాయని అభిమానులు ఆమెకు ఫిదా అయిపోయారు. షారూక్ ఖాన్ మాత్రం పిల్లల చదువంతా అయ్యాకే సినిమాలు అన్నారట. అదే విధంగా ఆయన పిల్లలు షారూక్ బ్రాండ్‌కు దూరంగా తమదైన మార్క్ చూపించాలన్న ఆలోచనతో యాక్టింగ్ షారూక్ దగ్గర కాకుండా బయటే నేర్చుకుంటున్నారట! మరి ఈ సూపర్‌స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చే టైమ్‌కి బాలీవుడ్ ఎలా ఉంటుందో కానీ అభిమానులైతే ఇప్పట్నుంచే ఎదురుచూడడం మొదలుపెట్టేశారు!!
Comments
Please login to add a commentAdd a comment