Dairy Sector
-
పశుపోషకులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: నాణ్యమైన దాణాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పశుపోషకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పశు పోషణ ఖర్చును భారీగా తగ్గించి.. పాడిరంగాన్ని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ఏపీ పశు దాణా చట్టం –2020 తీసుకొచ్చింది. దీని పరిధిలోకి దాణా తయారీ, సరఫరా, అమ్మకం కార్యకలాపాలన్నింటినీ తెచ్చింది. అంతేకాకుండా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకందార్లకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన.. కల్తీలేని దాణా, ఖనిజ లవణ మిశ్రమాన్ని నిర్దేశించిన ధరలకు అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,680 మంది తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్ట్‌లకు ఈ చట్టం కింద లైసెన్స్‌లు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నాసిరకం దాణా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతోంది. లైసెన్సుల జారీ, శాంపిల్స్ తనిఖీల ద్వారా ఇప్పటివరకు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. పశువుల ఆహార అవసరాలకే 70 శాతం ఖర్చు రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. మూగజీవాలకు ఏటా 65 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా ఏటా సగటున 70.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోందని అంచనా. పశుపోషణ కోసం చేసే ఖర్చులో 70 శాతం వాటి ఆహార అవసరాల కోసమే ఉంటోంది. గతంలో నాణ్యత విషయంలో దాణా తయారీదారులు గోప్యత పాటించడం పశుపోషకులకు ఆశనిపాతంగా ఉండేది. దాణాలో.. తేమ, ముడి మాంసకృత్తులు, ముడి కొవ్వు పదార్థాలు, ముడి పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా తయారైన దాణాను అధిక మోతాదులో వినియోగిస్తే తప్ప ఆశించిన స్థాయిలో ఉత్పాదన వచ్చేది కాదు. ముడి మాంసకృత్తులను పెంచడానికి కొంతమంది తయారీదారులు చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు. దీంతో పెట్టుబడి భారం పెరగడంతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తి రాక పశుపోషకులు ఆర్థికంగా నష్టపోయేవారు. మరోవైపు ఆరోగ్యవంతమైన పశువులు సైతం దీర్ఘకాలిక రోగాల బారిన పడేవి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఏపీ పశు దాణా చట్టం తెచ్చింది. ఈ చట్టం 2021 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం అమలుకు ప్రత్యేక కమిటీలు పశు దాణా చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పశుదాణా నాణ్యత, నియంత్రణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘కంట్రోలింగ్ అథారిటీ, కలెక్టర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయి లైసెన్సింగ్ అథారిటీలను నియమించింది. పశుదాణా నాణ్యతను తనిఖీ చేసేందుకు స్థానిక పశువైద్యులకు యానిమల్ ఫీడ్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. వీరు క్షేత్ర స్థాయి తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్‌కు ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు. తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ షాపులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ పేరిట ప్రత్యేకంగా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు 1,680 మంది దాణా తయారీదారులు, అమ్మకందార్లకు లైసెన్సులు ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గతంతో పోలిస్తే నాసిరకం దాణా తయారీ, సరఫరా, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని పశుపోషకులు చెబుతున్నారు. నాణ్యత లేని దాణా తయారుచేస్తే క్రిమినల్ కేసులు.. పశు దాణా చట్టం అమల్లోకి వచ్చాక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నాం. నాణ్యత లేని దాణా తయారీదారులు, నిరీ్ణత ప్రమాణాలు పాటించనివారు, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే కనీసం ఏడేళ్లు జైలుశిక్ష, తగిన జరిమానా పడుతుంది. – డాక్టర్ అమరేంద్రకుమార్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
Akshali Shah: విజయంలో సగపాలు
‘పాడి రంగంలో మన దేశంలో మూడొంతుల మంది స్త్రీలే పని చేసి విజయం సాధిస్తున్నారు’ అని గత సంవత్సరం ‘వరల్డ్ డెయిరీ సమ్మిట్’లో ప్రధాని నరేంద్రమోడి అన్నారు. పశు పోషణ చేసి, పాలు పితికి, ఆదాయ మార్గాలు వెతికి విజయం సాధిస్తున్న మహిళలు ఎందరో నేడు ఆ మాటను నిజం చేస్తున్నారు. నేడు ‘వరల్డ్ మిల్క్ డే’ ‘ఎంజాయ్ డెయిరీ ప్రాడక్ట్’ అనేది థీమ్. ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ పేరుతో డెయిరీ ప్రాడక్ట్స్ దేశంలోనే అగ్రశ్రేణిగా నిలిచింది అక్షాలి షా. 32 ఏళ్ల అక్షాలి షా నేడొక దేశంలో ఉంటే రేపు మరో దేశంలో ఉంటుంది. ఏ దేశంలో పాడి రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో, పాడి ఉత్పత్తులలో ఎలాంటి సాంకేతికత చోటు చేసుకుంటున్నదో నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఆ మార్పులను తాను అధినాయకత్వం వహిస్తున్న ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ సంస్థలో ప్రవేశపెడుతూ ఉంటుంది. అందుకే ఇవాళ ప్యాకేజ్డ్ పాల రంగంలో, డెయిరీ ఉత్పత్తుల రంగంలో పరాగ్ సంస్థ అగ్రగామిగా ఉంది. అందుకు పూర్తి క్రెడిట్ అక్షాలి షాకు దక్కుతుంది. 2010లో పగ్గాలు చేపట్టి ఎం.బి.ఏ.లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన అక్షాలి షా తన తండ్రి దేవేంద్ర షా స్థాపించి నిర్వహిస్తున్న పాడి పరిశ్రమ రంగంలో 2010లో అడుగుపెట్టింది. అయితే తండ్రి ఆమెకు వెంటనే సంస్థ పగ్గాలు అప్పగించకుండా పెరుగు తయారు చేసే ఒక చిన్న ప్లాంట్‌ను ఇచ్చి దానిని డెవలప్ చేయమన్నాడు. అక్షాలి విజయం సాధించేసరికి మెల్ల మెల్లగా సంస్థలో ఆమె స్థానం, స్థాయి పెరుగుతూ పోయాయి. ‘భారతీయుల సంస్కృతిలో పాలు, గోవు చాలా విశిష్టమైన స్థానంలో ఉంటాయి. మన పురాణాల్లో క్షీరం ప్రస్తావన ప్రముఖంగా ఉంటుంది. అందుకే నేను ఈ రంగాన్ని ఆషామాషీగా నిర్వహించదలుచుకోలేదు. నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించగలిగితే కనుక సెంటిమెంట్ కనెక్ట్ అవుతుందనుకున్నాను’ అంటుంది అక్షాలి. ప్రొటీన్ ఉత్పత్తులు శాకాహారంలో 84 శాతం, మాంసాహారంలో 65 శాతం ప్రొటీన్ లోపం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ‘ఆరోగ్య, క్రీడా రంగంలో ప్రొటీన్ ప్రాడక్ట్స్‌కు నేడు దేశంలో ఏటా 2000 కోట్ల మార్కెట్ ఉంది. ప్రొటీన్ పౌడర్లు తీసుకునే ఫిట్నెస్ ప్రియులు చాలామంది ఉంటారు. అందుకే పాల నుంచి సేకరించిన ప్రొటీన్ ప్రాడక్ట్‌లను తయారు చేసి విక్రయిస్తున్నాం. అవతార్, గో ప్రొటీన్ పేరుతో మా ప్రాడక్ట్లు ఉన్నాయి’ అంటుంది అక్షాలి. పరాగ్ సంస్థ నుంచి ‘గోవర్థన్’ పేరుతో నెయ్యి దొరుకుతోంది. ఇక చీజ్ అమ్మకాల్లో అక్షాలి సంస్థ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు... ఈ అన్ని ఉత్పత్తుల్లో సంస్థ మంచి అమ్మకాలు సాధిస్తోంది. పూర్వం పాలు, పెరుగు స్త్రీలే అమ్మేవారు. వారికి పాలను ఎలా ఆదాయవనరుగా చేసుకోవాలో తెలుసు. అక్షాలి లాంటి నవతరం డెయిరీ లీడర్లు అదే నిరూపిస్తున్నారు. గడప చెంతకు ఆవుపాలు అక్షాలికి పూణెలో గోక్షేత్రం ఉంది. 2011 నాటికి అక్కడి ఆవుల నుంచి పాలు పితికి, కేవలం ఆవుపాలు కోరే 172 మంది ఖాతాదారులకు అందించేవారు. అక్షాలి రంగంలోకి దిగాక శ్రేష్టమైన ఆవు పాల కోసం దేశంలో కోట్ల మంది ఖాతాదారులు ప్రయత్నిస్తుంటారని అర్థం చేసుకుంది. ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో ప్రీమియమ్ ఆవుపాలను అందించడానికి ముందుకు వచ్చింది. మానవ రహితంగా ఆవుల నుంచి పాలను పితికి, ప్యాక్ చేసి, విమానాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చి తాజాగా ఖాతాదారుల గడప దగ్గరకు ప్యాకెట్టు పడేలా నెట్వర్క్ సిద్దం చేసింది. ఇంత శ్రేష్టత పాటించడం వల్ల మార్కెట్లో ఆవు పాల కంటే ఈ పాలు రెట్టింపు ధర ఉంటాయి. అయినా సరే కస్టమర్లు తండోప తండాలుగా ఈ పాలను కోరుకున్నారు. ఇవాళ అక్షాలి సరఫరా చేస్తున్న ఆవుపాలు ఢిల్లీ, ముంబై, పూణె, సూరత్‌లలో విశేషంగా అమ్ముడు పోతున్నాయి. 2027 నాటికి కేవలం ఈ ఆవుపాల టర్నోవర్ 400 కోట్లకు చేరుకుంటుందని అక్షాలి అంచనా. -
సహకార డెయిరీ రంగాన్ని చంపేసింది చంద్రబాబే
చంద్రబాబు ప్రభుత్వం హయాం.. రాష్ట్రంలో సహకార డెయిరీలను ప్రభుత్వమే చిదిమేసింది. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ ఎదుగుదల కోసం గ్రామ గ్రామాన వేళ్లూనుకొన్న సహకార డెయిరీలను ఆయన ప్రభుత్వమే నాశనం చేసేసింది. కొన్నింటిని తనకు అనుంగులుగా ఉండే వ్యక్తులకు అప్పజెప్పింది. చివరకు రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. పాలకు కనీస ధర కూడా అందక అల్లాడిపోయారు. ‘ఈనాడు’ విషం.. విషపు రాతల ‘ఈనాడు’కు ఈ వాస్తవాలు పట్టవు. ప్రజల సంక్షేమం అసలే పట్టదు. ఎంతసేపూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యం. అందులో భాగంగానే ‘అమూల్ మాకొద్ద’ంటున్నారంటూ విషపు రాతలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మూతపడ్డ సహకార పాల డెయిరీలు పునరుద్ధరించి, పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ గ్రామాన మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి సహకార రంగాన్ని బలోపేతం చేసింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. లీటర్‌కు రూ. 4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం కింద లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూరుస్తోంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గిట్టుబాటు ధర వస్తోంది. అమూల్‌కు పాలు పోసే వారే కాదు.. అమూల్ రాకతో పాల సేకరణ ధరలు పెంచడం వలన ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్న పాడి రైతులూ లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీల రైతులకూ లబ్ధి అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకూ లబ్ధి చేకూరింది. అమూల్ పాల సేకరణ ధర పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ ధరలు పెంచాయి. అమూల్ ఇచ్చే ధరతో పోలిస్తే తక్కువే అయినా, వాటికి పాలు పోసే పాడి రైతులకు ఈ 30 నెలల్లో రూ.3,312.46 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార డెయిరీలకు చంద్రబాబు కాటు హెరిటేజ్ డెయిరీ కోసం రాష్ట్రంలో సహకార డెయిరీ రంగాన్ని ఓ పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని కంపెనీలుగా ప్రకటించుకున్నారు. విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా ప్రకటించుకున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు లాభాల్లో ఉన్న ప్రభుత్వ డెయిరీలన్నీ బాబు హయాంలో మూతపడ్డాయి. 2017 జనవరి 23న కడప జిల్లాలోని పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణాలోని మినీ డెయిరీ–కంకిపాడు, 2019 మార్చి 15న చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లి డెయిరీ, మరో 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మిల్క్ చిల్లింగ్ సెంటర్ (ఎంసీసీ)తో పాటు 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూలు) మూతపడ్డాయి. రాష్ట్రంలోని పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. పాల సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. కోట్లాది రూపాయల విలువైన మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిల్లింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటిపై ఈనాడు పత్రిక ఏనాడూ చిన్న వార్తా రాయలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి పాలను సేకరించడమే నిలిపివేసింది. రూ.45 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టారు. అయినా బాబు సర్కారు నోరు మెదపలేదు. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాల సహకార సంఘాల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు (ఎండీఎస్) ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాలు సేకరిస్తున్నారు. మూడు జిల్లాలతో మొదలైన పాల సేకరణ ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించింది. 20 – 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న ప్రైవేటు డెయిరీలు ప్రస్తుతం రోజుకు 5 – 6 లక్షల లీటర్లు సేకరిస్తుంటే, కేవలం 30 నెలల్లోనే అమూల్ సంస్థ రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలు రెండేళ్లకోసారి పాలసేకరణ ధరలు పెంచేవి. అమూల్ మూడు నెలలకోసారి పాల సేకరణ ధరలను సవరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఇలా 30 నెలల్లో ఏడు రెట్లు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.88, ఆవు పాలకు రూ.43.69 చెల్లిస్తున్నారు. 30 నెలల్లో గేదె పాలపై రూ.16.53, ఆవు పాలపై రూ. 9.49 మేర ధరలు పెంచారు. ఒక్క రూపాయి తక్కువ కాకుండా 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు ఆర్బీకేల ద్వారా ఇన్పుట్స్ అందిస్తున్నారు. మధ్యవర్తులు, వాటాదారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా ప్రోత్సాహకం, బోనస్ పంపిణీ చేస్తున్నారు. ఏటా 2 సార్లు లీటరుకు అర్ధ రూపాయి లాయల్టీ బోనస్ కూడా వస్తోంది. పాడి రైతుల సంరక్షణ, నిర్వహణ కోసం రూ.40 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా స్వల్పకాలిక రుణాలందిస్తున్నారు. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలు నిర్మిస్తున్నారు. – సాక్షి, అమరావతి -
డెయిరీ పరిశ్రమలో వృద్ధి జోరు
ముంబై: ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) డెయిరీ రంగం 9–11 శాతం మధ్య వృద్ధిని సాధించొచ్చని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. తలసరిగా పాలు, పాల పదార్థాల వినియోగం పెరగడం, పట్టణీకరణతో ఆహార పరమైన ప్రాధాన్యతల్లో వస్తున్న మార్పులు, ప్రభుత్వం నుంచి స్థిరమైన మద్దతు కూడా డైరీ వృద్ధికి తోడ్పడతాయని పేర్కొంది. దీర్ఘకాలంలో ఈ పరిశ్రమకు స్థిరమైన రేటింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత పరిశ్రమలో స్థిరమైన రికవరీ కనిపించినట్టు తెలిపింది. ‘‘డిమాండ్ పుంజుకోవడంపై మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కరోనా కేసుల ప్రభావం పడింది. సంస్థాగత స్థాయిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజా కేసలు గణనీయంగా తగ్గిపోవడం, వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగే పరిస్థితులతో ఇటీవలి కాలంలో డిమాండ్ చక్కగా పుంజుకుంది. పాడి పరిశ్రమలో సంఘటిత రంగం (కంపెనీలు) వాటా 26–30 శాతంగా ఉంటుంది. అసంఘటిత రంగంతో (వ్యక్తులు/సంఘాలు)తో పోలిస్తే సంఘటిత రంగమే వేగవంతమైన వృద్ధిని చూస్తోంది. ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది’’అని ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ షీతల్ శరద్ పేర్కొన్నారు. పాడి రంగంలో కేవలం పాల (సగంపైన వాటా) వరకే చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి స్థిరంగా 6–7 శాతం మధ్యే ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. -
ప్రతి రోజు పాలు తాగుతున్నారా.. అయితే తెలుసుకోండి!
మనిషి పుట్టుక మొదలు చనిపోయే వరకు అన్ని దశల్లోనూ పాల వాడకం ఉంటుంది. పాలు, పాల నుంచి వచ్చే పెరుగు, వెన్న నెయ్యి, తీపి పదార్థాలు అన్నీ మనిషి మనుగడకు ప్రధానం. గ్రామీణ జీవితంలో ప్రధాన ఆదాయ వనరు, ఎంతో మందికి జీవనాధారమైనది పాడి పంట. ఇక అమ్మ పాలు అమృతం. తల్లిపాలు ఎక్కువకాలం తాగే పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. పాలలో విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి కాల్షియం, ప్రోటీన్‌తో సహా పెరుగుతున్న శరీరానికి సహాయపడతాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుకుంటారు. ఈ ఏడాది ప్రపంచ పాల దినోత్సవ థీమ్ ‘పాడి రంగంలో సుస్థిరత’. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.. పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: పాలలో మనకు అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి. దీనిని ‘‘ఫుల్ ప్రోటీన్’’ అంటారు. పాలలో లభించే రెండు రకాల ప్రోటీన్లు కాసిన్, పాలవిరుగుడు ప్రోటీన్. కాసిన్ రక్తపోటును తగ్గిస్తే, పాలవిరుగుడు ప్రోటీన్ మానసిక స్థితిని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గిస్తుంది. పాలు తీసుకుంటే ఈ పోషకాలు మీ సొంతం: మనం తీసుకునే ఆహారంలో లభించని చాలా పోషకాలు పాలలో దొరుకుతాయి. వైట్ డ్రింక్ పొటాషియం, బి12, కాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు సాధారణంగా చాలా ఆహార పదార్థాల్లో ఉండవు. కానీ ఇవి పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, బి1, బి2, పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. ఎముకలు దృఢంగా: పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ల వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పాలను ప్రతి రోజు తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువును తగ్గిస్తుంది: పాలలో కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి బరువు తగ్గిస్తుంది. పాలతో ఆస్టియో ఆర్థరైటిస్‌కు చెక్: మోకాళ్లలో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌కు ప్రస్తుతం చికిత్స లేదు. అయితే ప్రతిరోజూ పాలు తాగడం ద్వారా ఈ వ్యాధిని అధిగమించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. క్యాన్సర్ నుంచి రక్షణ: పాలలో కాల్షియం, విటమిన్-డి ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాపడుతాయి. పెద్దపేగు క్యాన్సర్ లేదా పురీషనాళ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్షియం గట్ లైనింగ్‌ను కాపాడుతుంది. కణాల పెరుగుదల నియంత్రణలో విటమిన్-డి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జాగ్రత్త.. జీర్ణం కాకపోతే! అయితే కొంత మంది వ్యక్తులు పాలల్లో ఉండే లాక్టోస్ వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. లాక్టోస్ అనేది పాల ఉత్పత్తులలో కనిపించే ఒక పదార్ధం. లాక్టోస్ అనేది పడకపోతే పాలను జీర్ణం చేసుకోవడం కష్టం. దీనివల్ల పాలు తాగిన తర్వాత కడుపులో ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు తిమ్మిరి వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!) -
డెయిరీ రంగంలోకి ‘కైన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెయిరీ రంగంలోకి కొత్త బ్రాండ్ ‘కైన్’ రంగ ప్రవేశం చేసింది. ఉమెనోవా డెయిరీ ప్రమోట్ చేస్తున్న ఈ బ్రాండ్‌లో ప్రస్తుతం టెట్రా ప్యాక్‌లో పోషకాలతో కూడిన పాలను విక్రయిస్తున్నారు. కొద్ది రోజుల్లో కుర్కుమిన్, హనీ వేరియంట్లను అందుబాటులోకి తెస్తారు. 2021 జూన్ నాటికి నెయ్యి, పెరుగు, వెన్న, పనీర్ వంటి 15 రకాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో కంపెనీ టెట్రా ప్యాక్ పాలను విక్రయిస్తోంది. లీటరు ప్యాక్ ధర రూ.65 ఉంది. ఉమెనోవా డెయిరీకి చైర్‌పర్సన్‌గా పడిగల లీలావతి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైన్ ఉత్పత్తులను గురువారం ఆవిష్కరించారు. అత్యాధునిక మిషనరీతో.. ఉమెనోవా డెయిరీ మాతృ సంస్థ ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ వికారాబాద్ జిల్లాలో 16.5 ఎకరాల్లో ప్లాంటును నిర్మిస్తోంది. డెన్మార్క్, యూఎస్ నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక మెషినరీని వాడుతున్నారు. మొత్తం సుమారు రూ.200 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు సంస్థ సీఈవో రంగయ్య వి శెట్లం సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘2021 జూన్ నాటికి ప్లాంటు పూర్తిగా సిద్ధం కానుంది. రోజుకు లక్ష లీటర్ల పాలను ప్రాసెస్ చేయగలదు. సుమారు 200 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. పేపర్ ప్యాకింగ్‌లో..: భారత్‌లో తొలిసారిగా గేబుల్ టాప్ ప్యాకింగ్‌లో తాజా పాలను తేనున్నట్టు రంగయ్య వెల్లడించారు. ‘పూర్తిగా పేపర్‌తో ప్యాకింగ్ ఉంటుంది. ఏడు రోజులపాటు పాలు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాల మాదిరిగానే ధర ఉంటుంది. యూఎస్, జర్మనీ మెషినరీని తెప్పిస్తున్నాం’ అని తెలిపారు. ఒమన్‌లో 25 ఏళ్లుగా డెయిరీ, బెవరేజెస్ రంగంలో జాకీ ఫుడ్స్ పేరుతో కంపెనీని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
డెయిరీ రంగంలోకి ‘వల్లభ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెయిరీ రంగంలోకి మరో బ్రాండు ‘వల్లభ’ ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 20న ఆంధ్రప్రదేశ్‌లో, 25న తెలంగాణలో ఈ బ్రాండ్ అడుగు పెడుతోంది. పాలతోపాటు పెరుగు, లస్సి, మజ్జిగ, పనీర్, ఐస్ క్రీం, నెయ్యి వంటి ఉత్పత్తులను విక్రయించనుంది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా తమిళనాడు, కర్ణాటక మార్కెట్లలో ఈ ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలకు శాంపిళ్లను విడుదల చేసినట్లు వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ చైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తామన్నారు. తొలి దశలో 500 దాకా పార్లర్లను నెలకొల్పుతామని వివరించారు. రూ.200 కోట్లతో.. డెయిరీ కోసం కంపెనీ తొలిదశలో రూ.200 కోట్లను వెచ్చిస్తోంది. చిత్తూరు జిల్లా కాణిపాకం, గుంటూరు జిల్లా వినుకొండతోపాటు రాజమండ్రి, హైదరాబాద్‌లో ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంటుంది. ఏడాది చివరికి 100 పాల శీతలీకరణ కేంద్రాలను సైతం కంపెనీ ఏర్పాటు చేస్తోంది. వినుకొండ యూనిట్ ఏప్రిల్ 19న ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రం అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ యూనిట్ నుంచే తెలంగాణకు పాలను సరఫరా చేస్తారు. వల్లభ గ్రూప్ నుంచి.. తిరుమల డెయిరీ వ్యవస్థాపకుల్లో ఒకరైన బొల్లా బ్రహ్మనాయుడు వల్లభ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. వల్లభ గ్రూప్ ఇప్పటికే పశు దాణా, రైస్ బ్రాన్ ఆయిల్ తయారీలో ఉంది. వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీలో బ్రహ్మనాయుడుకు 55 శాతం వాటా ఉంది. తిరుమల డెయిరీని ఫ్రాన్స్‌కు చెందిన లాక్టాలిస్ గ్రూప్ 2014లో సుమారు రూ.1,750 కోట్లకు కొనుగోలు చేసింది. లాక్టాలిస్‌తో అప్పటి తిరుమల మిల్క్ ప్రమోటర్లకున్న నాన్–కాంపీట్ (పోటీకి రాకూడదు) ఒప్పందం ఇటీవలే ముగిసింది. -
క్షీర విప్లవం తెద్దాం
► రాష్ట్రంలో పాల వెల్లువ రావాలి: ముఖ్యమంత్రి కేసీఆర్ ► పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై ఇంటింటికో గేదె ► రెండు లక్షల మంది సొసైటీ సభ్యులకు వర్తింపజేస్తాం ► ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తాం ► ఇతర రాష్ట్రాల నుంచి పాలు తెచ్చుకునే పరిస్థితి పోవాలి ► ‘విజయ’ తరహాలో మిగతా సొసైటీలకు రూ. 4 ప్రోత్సాహకం ► త్వరలోనే మరో భారీ పథకం తెస్తామని వెల్లడి ► ప్రగతి భవన్లో పాల ఉత్పత్తిదారులతో సమావేశం సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు ముందే రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులపై వరాల జల్లు కురిపించింది. పాడి రైతుల అభివృద్ధికి త్వరలోనే భారీ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈలోపు రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు యాభై శాతం సబ్సిడీపై గేదెలను పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది పాల సొసైటీ సభ్యులందరికీ దీన్ని వర్తింపజేస్తామని, రెండు నెలల్లోనే ఈ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. విజయ డెయిరీ తరహాలో పాడి రైతులకు చెల్లిస్తున్న రూ.4 ప్రోత్సాహక ధరను కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి పాల సొసైటీలకు కూడా చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పాల ఉత్పత్తిదారులతో ఆదివారం ప్రగతిభవన్‌లోని జనహితలో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో తలసరి పాల వినియోగం తక్కువగా ఉంది. ప్రజల అవసరానికి సరిపడేన్ని పాలు ఉత్పత్తి కావటం లేదు. రాష్ట్రానికి కావాల్సిన పాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం సిగ్గుచేటుగా ఉంది. అందుకే పాల ఉత్పత్తి పెరగాలి. మన రాష్ట్రంలో అవసరమయ్యే పాలన్నీ మనమే ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం 6 లక్షల లీటర్లు కరీంనగర్ నుంచి వస్తున్నాయి. మరో 4 లక్షలు ఆంధ్రకెళ్లి, 2 లక్షలు గుజ్రాత్ నుంచి వస్తున్నాయి. మనకు రైతులు లేరా..? సబ్సిడీ మీద గేదెలు కొనిస్తే పాలు ఉత్పత్తి చేయలేరా..? అందుకే ప్రభుత్వం తరపున రెండు పనులు చేస్తాం.. పాల సొసైటీల్లో ప్రస్తుతం రెండు లక్షల మంది రైతులున్నారు. 50 శాతం సబ్సిడీపై ఇంటికో గేదె కొనిస్తా. దాంతో పాల వెల్లువ వచ్చి ఉత్పత్తి పెరగాలే. రెండు నెలల్లో అందరం గేదెలు కొనాలే. ఎవరి గేదెలను వాళ్లే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పట్నుంచి సర్కారు సెలెక్ట్ చేయదు. మీకు నచ్చినవి మీరే కొనుగోలు చేయాలి. దీని ధర రూ.55 వేలు అయితే.. సగం రైతులు కట్టాలి. మిగతా సగం సొసైటీ చైర్మన్లు చెల్లిస్తారు. రెండు నెలల్లోపల ఆ డబ్బులు మంజూరు చేస్తాం. ఆరునెలల నాటికో.. ఎనిమిది నెలలకో మళ్లీ మిమ్మల్ని పిలుచుకుంటాం. అప్పటికి 10 లక్షల లీటర్లు పోస్తున్నాం సార్.. అని చెప్పే పరిస్థితి రావాలి. క్షీర విప్లవానికి ఇక్కణ్నుంచే తొలి అడుగు వేద్దాం. ఇదేం వట్టిగా కాదు. దాదాపు నాలుదైదు వందల కోట్లు కావాలి. నేను ఎక్కడన్న తిప్పలు పడుతా. కొంత దుబారా ఖర్చు తగ్గించి మీకు అవసరమైన నిధులు సమకూరుస్తా. నెల రోజుల్లోనే చైర్మన్లకు నిధులు విడుదల చేస్తాం. మిగతా సగం డబ్బులు మీరు జమ చేసుకొని గేదెలు కొనుక్కొండి. దీంతో లాభం జరుగుతది. ఎస్సీలు, ఎస్టీ రైతులు పేదోళ్లుంటారు. వారికి 75 శాతం సబ్సిడీ ఇద్దాం...’’అని చెప్పారు. మిగతా సొసైటీలకు ప్రోత్సాహక ధర ‘‘పాల సేకరణకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం మాదిరి విజయ డెయిరీకి లీటర్‌కు రూ.4 ప్రోత్సాహక ధర చెల్లిస్తున్నాం. విజయ డెయిరీకి ఇచ్చేనట్లే నల్లగొండ సొసైటీకి ఇవ్వాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి నావెంట పడుతున్నారు. వచ్చే వారం నుంచి విజయ డెయిరీ తరహాలోనే నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి సొసైటీలకు రూ.4 చెల్లిస్తాం. దసరా లోపే ఇస్తాం. ఈ నెల 24 వరకు చెల్లిస్తాం. రైతులందరూ చక్కగా పాడి పశువులను పెంచుకోవాలి. సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలి’’అని సీఎం అన్నారు. ఇంతటితో ఆగేది లేదు.. పాడి రైతుల కోసం త్వరలో మరో భారీ పథకం తెస్తామని సీఎం తెలిపారు. ‘‘ఇంతటితో ఆగేది లేదు. ఇంకా పెద్దగా ఆలోచన చేస్తున్నా. గొర్రెల విషయంలో పెద్దఎత్తున ఎలా చేశామో.. రాష్ట్రంలో క్షీర విప్లవం తెచ్చేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు ఒక పెద్ద స్కీమ్ తీసుకువచ్చే ఆలోచన ఉంది. గొర్రెల పంపిణీకి రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అలాగే పాల ఉత్పత్తిపై దృష్టి పెడతాం. పాల ఉత్పత్తి పెంచితే సరిపోదు. అంతమేరకు సేకరించి, సరఫరా చేసే శక్తి సామర్థ్యాలుండాలి. డెయిరీలను విస్తరించాలి. ఎక్కువ పాలు వస్తే దాన్ని పొడిచేసి నిల్వ చేయాలి. మిషన్లు తీసుకురావాలి. పెద్ద పథకం తీసుకువస్తే పశువులొక్కటే కాదు.. చాప్ కట్టర్స్, గడ్డి కోసే మిషన్లు, ఇవన్నీ పకడ్బందీగా చేయాలి. ఈ స్కీమ్‌కు నేనే డిజైన్ చేస్తా’’అని వివరించారు. మొక్కలు పెంచకుంటే నా మీద ఒట్టే.. ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటాలని పాడి రైతులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రంలో 2 లక్షల మంది పాల సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారు. నాదొక్కటే కోరిక. మీకు ఇంటికి ఆరు చొప్పున మొక్కలు సరఫరా చేస్తాం. అంటే పన్నెండు లక్షల చెట్లు. తప్పనిసరిగా ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలే. ఇంట్లో ఆరుగురుంటే ఒక్కొక్కదానికి ఒక్కరి పేరు పెట్టాలె. ఏ పేరు ఉన్నోళ్లు వాళ్లే.. ఓ జగ్గెడు నీళ్లు పోయాలె. చెట్టు పోతే.. ఇగ నేను పోయినా అనుకోవాలె... అంత పక్కాగా మొక్కలు పెంచండి.. మనం మన పిల్లకు ఎంత ధనం సంపాదించి ఇచ్చినా లాభం లేదు. భవిష్యత్‌లో వాళ్లు బతికే వాతావరణం ఉండాలి.. అందుకే మొక్కలు పెంచాలి. పెంచకపోతే నా మీద ఒట్టే..’ సీఎంకు కృతజ్ఞతల వెల్లువ సీఎం ప్రకటించిన హామీలతో జనహితకు తరలివచ్చిన సొసైటీల చైర్మన్లు, రైతులు చప్పట్ల కేరింతలతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలు రైతులకు బాసటగా ఉన్నాయని నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల సొసైటీల అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. పాల ప్రోత్సాహక ధరపై సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల యువ తెలంగాణ జేఏసీ చైర్మన్ జిట్టా బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో ఆగేది లేదు. ఇంకా పెద్దగా ఆలోచన చేస్తున్నా. రాష్ట్రంలో క్షీర విప్లవం తెచ్చేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు ఒక పెద్ద స్కీమ్ తీసుకువచ్చే ఆలోచన ఉంది. పాలను సేకరించి, సరఫరా చేసే శక్తి సామర్థ్యాలుండాలి. పశువులొక్కటే కాదు.. గడ్డికోసే మెషీన్లు, తదితరాలన్నీ పకడ్బందీగా చేయాలి. ఈ స్కీమ్‌కు నేనే డిజైన్ చేస్తా. – కేసీఆర్ -
‘డెయిరీ’లోకి ఆయిల్ ఇండియా
గౌహతి: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆయిల్ ఇండియా కంపెనీ పాల ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా అసోంలోని రెండు జిల్లాల్లో పాల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీ యోచిస్తోంది. గుజరాత్‌లోని అమూల్ తరహాలో అసోంలో పాల వ్యాపారంలోకి ప్రవేశించనున్నామని, కామధేను ప్రాజెక్ట్ పేరుతో ఈ కార్యకలాపాలను చేపట్టనున్నామని ఈ ఏడాది జూలైలోనే కంపెనీ సీఎండీ సునీల్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, ఆనంద్(ఐఆర్ఎంఏ)తో కంపెనీ ఇటీవలనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.