
ఫెస్టివల్స్, అకేషన్స్.. షార్ట్ ఫిల్మ్స్..
ఒక థీమ్‌నో, ఒక కథాంశాన్నో లేదా ఏదో ఒక సందేశాన్నో ఎంచుకుని అందుకు అనుగుణంగా చిన్న సినిమా తీయడం అనేది చాలా మంది ఫాలో అవుతున్నదే. అయితే ఇటీవల దానికి మరో స్టైల్ కూడా జతకలిసింది. అదేమిటంటే.. అకేషన్‌కు లేదా బర్నింగ్ ఇష్యూకు అనుగుణంగా వెంటనే కెమెరా కదిలించడం. నిర్భయ ఘటన లాంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే చిన్న సినిమాలు తెరకెక్కాయి. అదే విధంగా విభిన్న రకాల సందర్భాలు, ముఖ్యమైన రోజుల్ని కూడా ఆధారంగా తీసుకుని తీస్తున్నారు. నిన్న గాక మొన్న ముగిసిన ఫ్రెండ్షిప్‌డే సందర్భంగా స్నేహం కథాంశంతో చాలా చిత్రాలు తీశారు. అదే బాటలో ‘రాఖీ’ పండుగ సందర్భంగా తాజాగా బ్రదర్/సిస్టర్ సెంటిమెంట్‌ను, అనుబంధాల్ని రంగరించిన పలు చిన్ని సినిమాలు వెలుగు చూశాయి. రానున్న ఆగస్టు 15ని పురస్కరించుకుని కూడా పలు షార్ట్ ఫిల్మ్‌లు రూపాందాయి. సందర్భానికి అనుగుణంగా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అనే ట్రెండ్ కూడా మంచి పరిణామమే. విభిన్న రకాల కధాంశాలు, వి‘చిత్రాలు’ తెరంగేట్రం చేసేందుకు ఇది ఉపకరించవచ్చు.
-ఎస్బీ