నిత్యామీనన్ అరుదైన అమ్మాయి. ‘జెమ్’ అనుకోండి. అందం, యాక్టింగ్.. వీటి గురించి కాదు. ఆమె అభిప్రాయాలు బోల్డ్‌గా ఉంటాయి. అవునా! ఇదేం గొప్ప సంగతి? ఇప్పటి అమ్మాయిలంతా బోల్డ్‌గానే ఉంటున్నారుగా. నిజమే అనుకోండి, జెండర్ విషయాల్లో నిత్య.. న్యాయంగా ఉంటారు. అంటే.. అబ్బాయిలందర్నీ పట్టుకుని తిట్టేయరు.. ‘వీళ్లింతే’ అని! అలాగే అమ్మాయిల్నీ కారణం లేకుండా వెనుకేసుకురారు. మలయాళం మూవీ ఇండస్ట్రీలో మగాళ్లదే రాజ్యం అయిపోయిందని ఈమధ్య నిత్య కో–స్టార్ పార్వతి అన్నప్పుడు.. మీడియా అంతా నిత్య చుట్టూ చేరింది. ‘నిజమేనా?’ అని! సినిమా పరిశ్రమలో ఆడవాళ్లకు ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్’ ఉండడం లేదన్నది కూడా పార్వతి చేసిన ఒక కామెంట్. ‘ఆ.. నిజమే’ అన్నారు నిత్య. అలాగని ఆమె మగవాళ్లనేం తప్పు పట్టలేదు.
‘‘ఎక్కడ మాత్రం లేదు చెప్పండి మగవాళ్ల రాజ్యం?! ఇళ్లు, ఆఫీస్‌లు.. అలాగే సినిమా ఇండస్ట్రీ. మొత్తం సొసైటీనే ఇలా ఉన్నప్పుడు.. మనకున్న ఒకే చాయిస్.. ఉమెన్‌గా మన ప్రత్యేకత ఏంటో నిరూపించుకోవడం, మన అభిప్రాయం తెలుసుకోవడం తమ అవసరంగా మగవాళ్లు భావించే పరిస్థితి తీసుకురావడం’’ అన్నారు నిత్య. ‘మిసాజనీ’ అనే మాటను కూడా నిత్య నవ్వుతూ కొట్టేస్తారు. మిసాజనీ అంటే.. స్త్రీ ద్వేషం. ‘‘పనిగట్టుకునైతే మగాళ్లు స్త్రీలను ద్వేషిస్తారని అనుకోను. పురుషాధిక్య సమాజం కదా. తీసిపడేయడం అనే ఆ హ్యాబిట్ అలా వచ్చేస్తుంటుంది.. మగాళ్లు ఎంత సభ్యతగా బిహేవ్ చేయాలనుకున్నా..’’ అంటోంది నిత్య. ప్రస్తుతం నిత్య ‘ప్రాణ’ అనే మలయాళం మూవీలో నటిస్తోంది. అందులోని థీమ్.. ఇదే.. భావ ప్రకటన స్వేచ్ఛ. ‘ఆ’ అనే తెలుగు సినిమాలో కూడా నిత్య నటిస్తోంది.
మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు
Published Tue, Jan 2 2018 11:47 PM | Last Updated on Wed, Jan 3 2018 10:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment