nithyamenon
-
నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి
‘‘అనుకోకుండా నేను సినిమాల్లోకి వచ్చాను. కాలం గడిచే కొద్ది నా జర్నీలో సినిమాపై చాలా ఇష్టం పెరిగింది. సినిమా మాధ్యమంతో ప్రజలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయవచ్చని తెలుసుకున్నాను’’ అని అన్నారు కథానాయిక నిత్యామీనన్. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యామీనన్ పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ తక్కువగా ఉంటుందనే మాటలు వినిపిస్తుంటాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్నకు నిత్యామీనన్ బదులు ఇస్తూ–‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మహిళలపై వేధింపులు ఉంటాయనుకుంటే పొరపాటే. అన్ని సెక్టార్స్‌లోనూ ఉన్నాయి. నా కెరీర్లో ఎప్పుడూ ఒక మహిళగా నాకు భద్రత లేదని అనిపించలేదు. కానీ, కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించాలని ప్రయత్నించారు. నేను ఊరుకోలేదు. ‘మహిళలంటే గౌరవం లేదా? కాస్త హుందాగా వ్యవహరించు’ అంటూ ఘాటుగానే స్పందించాను. ఏ విషయంలోనైనా ఎంతోకొంత మన ప్రమేయం ఉన్నప్పుడే ఇతరులు జోక్యం చేసుగోలరు. అందుకే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నిర్మొహమాటంగా మన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి.. బెదిరిపోవాల్సిన అవసరం లేదు’’ అన్నారు. -
ఓనమ్ వచ్చెను చూడు
కేరళలో సెప్టెంబర్ 10 నుంచి ‘ఓనమ్’పండుగ వేడుకలు జరుగుతున్నాయి. తెలుగువారికి సంక్రాంతి ఎలాగోమలయాళీలకు ఓనమ్ అలాగ. పూలు,ఫలాలు, పంటలు, పిండి వంటలు,పాటలు, ఆటలు, పోటీలు...ఇవన్నీ ఓనమ్ పండుగ సమయంలోకేరళ అంతటినీ కళకళలాడిస్తాయి.ఆ సినిమా తారలను కూడా. కేరళను ‘దేవుని సొంత భూమి’గా చెప్తారు. అయితే ఇది ఒకప్పుడు దేవుని వద్ద లేదు. దీని పాలకుడు అసురుడు. బలి చక్రవర్తి. అయితే అందమైన ఈ భూమి మీద దేవుడు మనసుపడ్డాడు. అందుకే వామనుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి ‘మూడు అడుగుల నేల’ అడిగాడు. మొదటి రెండు అడుగులకే మూల్లోకాలు ఆక్రమితమయ్యాయి. ఇక మిగిలింది బలి చక్రవర్తి శిరస్సే. అమిత విష్ణుభక్తుడైన బలి వామనుడి మూడవ పాదాన్ని తన శిరస్సు మీదే పెట్టమని అంటాడు. ఆ తర్వాతి కథ ఏమైనా కేరళ వాసుల విశ్వాసం ప్రకారం బలి చక్రవర్తి భక్తికి విష్ణువు మెచ్చాడని, అందువల్ల ఒక వరం ప్రసాదించాడని, ఆ వరం ప్రకారం సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి సజీవుడైన తాను పాలించిన నేలకు (కేరళ) వచ్చి ఆ ప్రాంతాన్ని చూసుకుంటాడనీ. బలి వచ్చేవేళనే ఓనమ్ పండుగ వేళ. ఇది పురాణ కథ అయితే సాంస్కృతికంగా కేరళలో ఇది పంటలు ఇంటికి చేరే వేళ కనుక దీనిని విశేషంగా జరుపుకుంటారని విశ్లేషకులు అంటారు. కేరళ ప్రకృతి సౌందర్యానికే కాదు స్త్రీ సౌందర్యానికి కూడా పెట్టింది పేరు. అందుకే అక్కడి నుంచి కె.ఆర్.విజయ, పద్మినిలతో మొదలుపెట్టి నేటి అనుపమా పరమేశ్వరన్ వరకు ఎందరో హీరోయిన్లు దక్షణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగువారి హృదయాలను దోచారు. అక్కడి నుంచి వచ్చిన శోభన, వాణి విశ్వనాథ్ దాదాపు తెలుగు హీరోయిన్ల వలే లెక్కకు మించిన సినిమాల్లో పని చేశారు. రేవతి, ఊర్వశి, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, సితార, మీరా జాస్మిన్, అసిన్, నయన తార, ప్రియమణి, శ్వేతా మీనన్, కీర్తి సురేశ్, సాయి పల్లవి, నివేదా థామస్, అమలా పాల్... వీరంతా దాదాపు తెలుగవారి ఆడపడుచులు అయ్యారు. ఇక కేరళ మూలాలు ఉన్న సమంతా ఏకంగా అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది.పండుగల్లో పురుషుల పాత్ర ఎలా ఉన్నా స్త్రీల వల్లే వాటికి అందం వస్తుంది. ఓనమ్ పండుగ నాడు సంప్రదాయ ఓనమ్ చీరను కట్టడం తప్పనిసరి అని భావిస్తారు కేరళ స్త్రీలు. అందుకు మన హీరోయిన్లు కూడా భిన్నం కాదు. ఓనం చీరకే అందం తెచ్చిన ఆ సౌందర్యాన్ని చూడండి. ఇరుగు పొరుగున మలయాళీలు ఉంటే ఓనమ్ శుభాకాంక్షలు తెలపండి. -
బాధలో ఉంటే విమర్శలా?
‘నిత్యామీనన్ బాగా యాటిట్యూడ్ చూపిస్తోంది. పెద్ద ఈగోయిస్ట్. త్వరలోనే ఇండస్ట్రీలో నుంచి తనను బ్యాన్ చేయాలనుకుంటున్నాం’ అంటూ కొందరు మలయాళ నిర్మాతలు నిత్యామీనన్ గురించి విమర్శనాస్త్రాలు సంధించారు. నిర్మాతలు నిత్యపై ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు? కారణం ఏంటి? అంటే.. టి. రాజీవ్ కుమార్ రూపొందిస్తున్న మలయాళ చిత్రం ‘తత్సమయం ఒరు పెన్‌కుట్టి’లో నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ షూటింగ్లో ఆమె చిత్రబృందాన్ని ఇబ్బంది పెట్టారని, అలాగే కలవడానికి వచ్చిన నిర్మాతలను కలవలేదని సదరు నిర్మాతలు ఆరోపించారు. దాంతో ఆ నిర్మాతలు నిత్యను బ్యాన్ చేయాలని, అహంభావి అని కామెంట్స్ చేశారట. ఈ వివాదం గురించి నిత్యామీనన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందిస్తూ – ‘‘ఈ సంఘటన జరిగినప్పుడు (నిర్మాతలను కలవడానికి నిరాకరించినప్పుడు) మా అమ్మగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే విషయం తెలిసింది. థర్డ్ స్టేజ్. షూటింగ్ సమయాల్లో కూడా క్యారవ్యాన్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని. అప్పుడే నాకు మైగ్రేన్ కూడా అటాక్ అయింది. ఆ టైమ్‌లో నేను వాళ్లను కలసి మాట్లాడే పరిస్థితిలో లేను. అందుకే నన్ను ఈగోయిస్ట్ అని, యాటిట్యూడ్ చూపిస్తున్నానని అనుకొని ఉండొచ్చు. ఇలాంటి వాటిని పట్టించుకుని నా సమయాన్ని వృథా చేసుకోను. దానికి బదులు నా వర్క్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి పని చేస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్యామీనన్ ‘జయలలిత’ బయోపిక్, ‘అమేజాన్ బ్రీత్’ వెబ్ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపిస్తారని టాక్. -
స్క్రీన్ టెస్ట్
‘స్టార్స్ లైఫ్’ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అసలు వాళ్లు స్టార్స్ కాకముందు ఏం చేసేవారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా చాలా ఉంటుంది. కొందరు స్టార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేను హీరో కాకముందు చేపల చెరువుల వ్యాపారం చేసేవాణ్ణి. ప్రతి సంవత్సరం నష్టాలే తప్ప ఒక్కసారి కూడా లాభం రాలేదు. ఆ తర్వాత హీరో అయ్యాను అని చెప్పే ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) ్రçపభాస్ బి) కృష్ణంరాజు సి) చిరంజీవి డి) గోపీచంద్ 2. హీరో కాకముందు ఆయన వైజాగ్‌లో షూమార్ట్ నడిపేవారు. ఆ బిజినెస్ నష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. తర్వాత హీరో అయ్యారు. ఎవరా హీరో? ఎ) జె.డి. చక్రవర్తి బి) జగపతిబాబు సి) వెంకటేశ్ డి) శ్రీకాంత్ 3. ఇప్పుడామె ప్రపంచమంతటికీ హీరోయిన్గా తెలుసు. కానీ ఒకప్పుడు కెమెరా అసిస్టెంట్. ఎవరా హీరోయిన్? ఎ) స్నేహ బి) విజయశాంతి సి) రాధిక డి) సుహాసిని 4 జర్నలిస్ట్ అవుదామని జర్నలిజమ్ చదువుకుంది. అయితే తన ఐడియాలను జర్నలిజమ్ ద్వారా చెప్పలేనని పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ చేద్దామని వెళ్లినప్పుడు ఓ డైరెక్టర్ పరిచయం అయ్యి, నువ్వు యాక్ట్ చే స్తే బావుంటుంది అనటంతో మనసు మార్చుకుని హీరోయిన్ అయ్యింది. ఎవరా హీరోయిన్ తెలుసా? ఎ) రాధికా ఆప్టే బి) నిత్యా మీనన్ సి) మాళవికా అయ్యర్ డి) మాళవికా నాయర్ 5. నాని హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారని అందరికీ తెలుసు. కానీ అంతకుముందు మరో శాఖలో కూడా పని చేశారు. ఆయన గతంలో ఏ శాఖలో పని చేశారో తెలుసా? ఎ) సినిమాటోగ్రఫీ బి) డబ్బింగ్ సి) రేడియో జాకీ డి) సింగర్ 6. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘భద్ర’ చిత్రానికి కథారచయితగా చేసిన అతను ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ప్రామిసింగ్ డైరెక్టర్. ఆ టాలీవుడ్ ప్రామిసింగ్ డైరెక్టర్ ఎవరబ్బా? ఎ) వంశీ పైడిపల్లి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీ డి) కల్యాణ్‌కృష్ణ 7. ఒక ఆడియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలో జీవితం ప్రారంభించారు ఈయన. భారత దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు సంపాందించారు. ఎవరా దర్శకులు? ఎ) కె.విశ్వనాథ్ బి) బాలచందర్ సి) మణిరత్నం డి) కె. రాఘవేంద్ర రావు 8 . మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారీయన . శంకర్ సినిమా ద్వారా నటునిగా పరిచయమయ్యారు. ఎవరా హీరో? ఎ) సిద్ధార్థ్ బి) కార్తీ సి) మాధవన్ డి) అజిత్ 9. అతనో సింగర్. సినిమాల్లో పాటలు పాడక ముందు అనేక ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నోవార్టిస్‌లో ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేస్తున్న సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రీకృష్ణ బి) కారుణ్య సి) సింహా డి) హేమచంద్ర 10. యస్.యస్ తమన్ సంగీత దర్శకునిగా స్థిరపడక ముందు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో నటించి, నటునిగా మంచి మార్కులే సంపాదించాడు. అతను నటునిగా చేసిన చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) శంకర్ బి) యన్.శంకర్ సి) జయ శంకర్ డి) హరీశ్ శంకర్ 11. కోటగిరి వెంకటేశ్వరావు చిత్ర పరిశ్రమలో చాలా పేరున్న ఎడిటర్. ఆయన దగ్గర ఎడిటింగ్ శాఖలో శిక్షణ పొందిన దర్శకుడెవరో తెలుసా? ఎ) వీవీ వినాయక్ బి) చంద్రశేఖర్ యేలేటి సి) శ్రీను వైట్ల డి) యస్.యస్. రాజమౌళి 12. నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈయన. తర్వాత కాలంలో రచయితగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఎవరాయన? ఎ) గోపీమోహన్ బి) కోన వెంకట్ సి) అబ్బూరి రవి డి) సతీశ్ వేగేశ్న 13. హీరో అర్జున్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) విజయ్ బి) విశాల్ సి) ధనుశ్ డి) శివకార్తికేయన్ 14 హీరో అవ్వకముందు ఆయన రోజూ 80 కిలోమీటర్లు బైక్‌పై వెళ్లి 1800 రూపాయల జీతానికి బట్టలు తయారుచేసే కంపెనీలో పని చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) అల్లు అర్జున్ బి) విక్రమ్ సి) సూర్య డి) శింబు 15. భక్తవత్సలం నాయుడు సిల్వర్ స్క్రీన్ కోసం మోహన్‌బాబుగా మారక ముందు ఏం చేసేవారో తెలుసా? ఎ) డ్రిల్ మాస్టర్ బి) మ్యాథ్స్ టీచర్ సి) లెక్చరర్ డి) ఆర్టీసీ కండక్టర్ 16. ప్రస్తుతం క్యారెక్టర్ నటుడుగా బిజీగా ఉన్న కాశీ విశ్వనాథ్ గతంలో దర్శకుడు. ఆయన ఏ సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు? ఎ) సురేశ్ ప్రొడక్షన్స్ బి) వైజయంతి మూవీస్ సి) గీతా ఆర్ట్స్ డి) అన్నపూర్ణ పిక్చర్స్ 17. దాసరి నారాయణరావు దర్శకులు కాకముందు రైటర్‌గా పనిచేశారు. అంతకంటే ముందు ఆయన ఏం పనిచేసేవారో తెలుసా? ఎ) బ్యాంక్ ఉద్యోగి బి) నాటక రచయిత సి) పోస్ట్ మాస్టర్ డి) రైల్వే ఎంప్లాయి 18. నటుడు కాకముందు ఫైర్ మ్యాన్‌గా పనిచేసిన ఆ నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) గుమ్మడి సి) రాజనాల డి) కాంతారావు 19 . గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఇప్పటి హీరో ఎవరో తెలుసా? ఎ) ఆది పినిశెట్టి బి) సందీప్ కిషన్ సి) తనీష్æ డి) ప్రిన్స్ 20. హీరో కాకముందు బ్యాడ్మింటన్ క్రీడలో పుల్లెల గోపీచంద్‌తో కలిసి భారతదేశం తరఫున ఎన్నో టోర్నమెంట్స్‌లో పాల్గొన్న ఆ నటుడెవరో కనుక్కోండి? ఎ) సుధీర్‌బాబు బి) నవీన్‌చంద్ర సి) రాహుల్ రవీంద్రన్ డి) అఖిల్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) బి 5) సి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) డి 12) బి 13) బి 14) సి 1 5) ఎ 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు
నిత్యామీనన్ అరుదైన అమ్మాయి. ‘జెమ్’ అనుకోండి. అందం, యాక్టింగ్.. వీటి గురించి కాదు. ఆమె అభిప్రాయాలు బోల్డ్‌గా ఉంటాయి. అవునా! ఇదేం గొప్ప సంగతి? ఇప్పటి అమ్మాయిలంతా బోల్డ్‌గానే ఉంటున్నారుగా. నిజమే అనుకోండి, జెండర్ విషయాల్లో నిత్య.. న్యాయంగా ఉంటారు. అంటే.. అబ్బాయిలందర్నీ పట్టుకుని తిట్టేయరు.. ‘వీళ్లింతే’ అని! అలాగే అమ్మాయిల్నీ కారణం లేకుండా వెనుకేసుకురారు. మలయాళం మూవీ ఇండస్ట్రీలో మగాళ్లదే రాజ్యం అయిపోయిందని ఈమధ్య నిత్య కో–స్టార్ పార్వతి అన్నప్పుడు.. మీడియా అంతా నిత్య చుట్టూ చేరింది. ‘నిజమేనా?’ అని! సినిమా పరిశ్రమలో ఆడవాళ్లకు ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ఉండడం లేదన్నది కూడా పార్వతి చేసిన ఒక కామెంట్. ‘ఆ.. నిజమే’ అన్నారు నిత్య. అలాగని ఆమె మగవాళ్లనేం తప్పు పట్టలేదు. ‘‘ఎక్కడ మాత్రం లేదు చెప్పండి మగవాళ్ల రాజ్యం?! ఇళ్లు, ఆఫీస్‌లు.. అలాగే సినిమా ఇండస్ట్రీ. మొత్తం సొసైటీనే ఇలా ఉన్నప్పుడు.. మనకున్న ఒకే చాయిస్.. ఉమెన్‌గా మన ప్రత్యేకత ఏంటో నిరూపించుకోవడం, మన అభిప్రాయం తెలుసుకోవడం తమ అవసరంగా మగవాళ్లు భావించే పరిస్థితి తీసుకురావడం’’ అన్నారు నిత్య. ‘మిసాజనీ’ అనే మాటను కూడా నిత్య నవ్వుతూ కొట్టేస్తారు. మిసాజనీ అంటే.. స్త్రీ ద్వేషం. ‘‘పనిగట్టుకునైతే మగాళ్లు స్త్రీలను ద్వేషిస్తారని అనుకోను. పురుషాధిక్య సమాజం కదా. తీసిపడేయడం అనే ఆ హ్యాబిట్ అలా వచ్చేస్తుంటుంది.. మగాళ్లు ఎంత సభ్యతగా బిహేవ్ చేయాలనుకున్నా..’’ అంటోంది నిత్య. ప్రస్తుతం నిత్య ‘ప్రాణ’ అనే మలయాళం మూవీలో నటిస్తోంది. అందులోని థీమ్.. ఇదే.. భావ ప్రకటన స్వేచ్ఛ. ‘ఆ’ అనే తెలుగు సినిమాలో కూడా నిత్య నటిస్తోంది. -
నిజ జీవిత ఘటనల సమాహారం
సినిమా కల్పన మాత్రమే కాదు. నిజ జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతి రూపం. మనచుట్టూ జరిగే సంఘటనలే చిత్రాల్లో ఉంటారుు. అలాంటి మనలోని ఒకరికి ఎదురైన ఘోర అకృత్యాలే మాలిని 22 పాళయంకోటై చిత్రం అంటున్నారు చిత్ర దర్శకురాలు శ్రీప్రియ. ఒకనాటి ప్రముఖ హీరోయిన్ అయిన ఈమె ఇంతకు ముందు తమిళంలో నానే వరువేన్, శాంతి ముహుర్తం మరో రెండు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మాలిని 22 పాళయంకోటై ఐదవ చిత్రం. ఆమె భర్త రాజ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషించారు. వర్ధమాననటుడు క్రిష్ ఆమెకు జంటగా నటించగా టాలీవుడ్ నటుడు నరేష్ ముఖ్యపాత్ర పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీప్రియతో చిన్నభేటి.... ప్ర:మలయాళచిత్రం 22 ఫిమేల్ కొట్టాయం చిత్రాన్ని రీమేక్ చేయడానికి కారణం? జ: ఈ ఏడాది ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. అలాంటి సమయంలో నా స్నేహితురాలు ఒక సీడీ పంపి చూడమని చెప్పింది. ఆ చిత్రమే 22 ఫిమేల్ కొట్టాయం. చిత్రం చూసిన తర్వాత ఆత్మాభిమానం గల స్త్రీగా నాలో కొ న్ని ప్రశ్నలు తలెత్తాయి. కించిత్ కోపం కూడా కలిగింది. ప్ర: కోపానికి కారణం? జ: నేడు యువతులు, చిన్నారులపై అత్యాచార దురాఘాతాలు చూస్తుంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ కోపం వస్తుంది. రావాలి కూడా. అలా నా మనసును పిండేసిన ఒక సంఘటననే కమర్షియల్ అంశాలతో తెరరూపం ఇచ్చాను. అదే మాలిని 22 పాళయంకోటై. ప్ర: ఒరిజినల్ చిత్రంలో రిమ్ కళింగళ్ నటించిన పాత్రను తమిళంలో నిత్యామీనన్‌ను ఎంచుకోవడానికి కారణం ? జ: రిమ్ కళింగళ్ మలయాళ సంస్కృతికి అద్ధం పట్టేలా మం చి కమాండింగ్‌లా నటించారు. మళ్లీ ఆమెనే తమిళంలోను నటింప చేస్తే అనువాద వాసన వస్తుందనే ఉద్దేశంతో వేరే నటి కోసం అన్వేషిస్తుండగా నటి రాధిక నిత్యామీనన్ గురిం చి చెప్పారు. నిత్యను చూడగానే చాలా చిన్న అమ్మాయిలా అనిపించింది. అయితే కెమెరా ముందు వేరే విధంగా కని పించింది. అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ప్ర: హీరో క్రిష్ గురించి? జ: నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో నటించడానికి కొందరు హీరోలు భయపడ్డారు. పాత్ర కొంచెం నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో వారి ఇమేజ్ డామేజ్ అవుతుందని భావించి నటించడానికి నిరాకరించా రు. క్రిష్ నటించమని అడిగాను. తను నాకు చిన్న వయసు నుంచీ తెలుసు. అతని తల్లిదండ్రులు నటులే. క్రిష్ ఇం తకుముందు మోహన్‌లాల్‌తో కలసి మలయాళంలో ఒక చిత్రం చేశాడు. ఈ సినిమాలో క్రిష్ కు మంచి పేరు వస్తుంది. ప్ర: ప్రస్తుత కామెడీ ట్రెండ్‌లో సీరియస్ కథా చిత్రం తీశారే? జ: సినిమా ట్రెండ్ మారుతుండడం సహజమే. అయితే మాలిని 22 పాళయంకోటై పూర్తిగా సీరియస్ చిత్రం కాదు. అలాగని ఆర్ట్ చిత్రం కాదు. కమర్షియల్ అంశాలు ఉంటా యి. ఆడియన్స్ రెండు విషయాల గురించి ఆలోచిస్తారు. థియేటర్లో కూర్చోగలమా? అన్నది ఒకటైతే చిత్రంలో ఏమి జరుగుతోందన్న ఆసక్తి కలిగిస్తుందా? లేదా? అన్నది మరొకటి. ఈ రెండు మా చిత్రంలో ఉన్నాయి. ప్ర: దర్శకులుగా మహిళలు అంతగా రాణించలేకపోవడానికి కారణం? జ: తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని చోట్లా ఈ అభిప్రాయం ఉంది. దర్శకత్వం అనేది 24 గంటల పని. ఎలాంటి సమయంలోనైనా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలా అందరూ చేయగలరా?. నా వరకు చెప్పాలంటే మా అమ్మాయిప్పుడు లా చదువుతోంది. అబ్బాయి ప్లస్1 చదువుతున్నాడు. ఇద్దరూ ఎదుగుతున్నారు. నా భర్త కొన్ని విషయాలు చూసుకుంటారు. దీంతో నేను పూర్తిగా సినిమాపై దృష్టి సారించగలుగుతున్నాను. ఇక్కడ లింగభేదాలు చూడ డం సరికాదు. కథలో భాగంగా ఏదైనా సంభాషణను రాస్తే ఒక మహిళ దర్శకురాలై ఉండి అలాంటి సంభాషణలు చెప్పించవచ్చా లాంటి మనస్తత్వంలో మార్పు రావాలి.