అతనితో మనసు విప్పి మాట్లాడతా! | Deepika Padukone speaks of her love Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

అతనితో మనసు విప్పి మాట్లాడతా!

Published Fri, Dec 11 2015 1:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అతనితో మనసు విప్పి మాట్లాడతా! - Sakshi

అతనితో మనసు విప్పి మాట్లాడతా!

‘ఆర్’ పోయె ‘ఆర్’ వచ్చె అన్నట్లుగా... ఆర్ అక్షరం ఉన్న రణ్‌బీర్ కపూర్‌ని ప్రేమించి, అతడి నుంచి విడిపోయిన దీపికా పదుకొనె మళ్లీ ‘ఆర్’ అక్షరంతో ఉన్న రణ్‌వీర్ సింగ్‌తో ఆ మధ్య ప్రేమలో పడ్డారు. ఈ ఇద్దరూ తమ ప్రేమను బాహాటంగా ప్రకటించలేదు. కానీ, ‘మేం మంచి స్నేహితులం’ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, దీపిక ఇచ్చిన తాజా స్టేట్‌మెంట్ వీళ్లిద్దరూ కచ్చితంగా ప్రేమికులే అని స్పష్టం చేసింది. ‘రణ్‌వీర్‌తో నేను మనసువిప్పి మాట్లాడతా!’ అన్నదే ఆ స్టేట్‌మెంట్.
 
  సూటిగా దీపిక చేసిన ఈ వ్యాఖ్య హాట్ టాపిక్ అయ్యింది. అతణ్ణి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది కాబట్టే, ఆమె ఇలా మాట్లాడి ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంకా దీపిక ఏమేం చెప్పిందనే విషయానికొస్తే - ‘‘రణ్‌వీర్ నాకు మంచి స్నేహితుడు. నేను చాలా ఎమోషనల్, సెన్సిటివ్. త్వరగా హర్ట్ అయిపోతా. కానీ, రణ్‌వీర్ మాత్రం నన్ను హర్ట్ చేయడు.
 
  అతని మీద నాకెంత నమ్మకం అంటే, నేను అతనితో ఏ విషయమైన మనసు విప్పి మాట్లాడాతా! రణ్‌వీర్ అంటే నాకు ప్రేమ... గౌరవం. నేను నేనుగా ఉండే అవకాశం అతని దగ్గర నాకుంది. రణ్‌వీర్ సమక్షంలో నాకు సౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి వాటినే పవిత్రమైన బంధం అంటారు’’ అని దీపిక అన్నారు. మొత్తానికి రణ్‌వీర్, దీపికల మధ్య ఉన్నది బలమైన బంధం అని అర్థమవుతోంది. ఆమె చెబుతున్నట్లుగా ఇది స్నేహబంధమే అనుకున్నా, ఇది వివాహ బంధంగా కూడా మారుతుందో లేదో కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement