
ప్రీతి జింటాను విచారించనున్న పోలీసులు
బాలీవుడ్ భామ ప్రీతి జింటా దాఖలు చేసిన కేసులో పోలీసులు రెండు రోజుల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
ముంబై: మాజీ ప్రేయుడు నెస్ వాడియా తనపై దౌర్జన్యం చేసి చేయిచేసుకున్నాడంటూ బాలీవుడ్ భామ ప్రీతి జింటా దాఖలు చేసిన కేసులో పోలీసులు రెండు రోజుల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే అమెరికా వెళ్లిన ప్రీతి ఆదివారం మధ్యాహ్నం ముంబై తిరిగొచ్చారు.
ముంబై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడేందుకు ప్రీతి నిరాకరించారు. ఈ కేసులో సోమ లేదా మంగళవారం ప్రీతిని విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మే 30న ముంబై వాంఖడే స్టేడియంలో నెస్ వాడియా తనను దూషించి, చేయిచేసుకున్నాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణల్ని నెస్ వాడియా ఖండించారు. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసి విడిపోయిన ప్రీతి, నెస్ వాడియా కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు సహ భాగస్వాములు.