ఓటుకు కోట్లు కేసులో ప్రధాన ఫిర్యాదుదారు.. నామినేటెడ్ ఆగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్ సన్ వాగ్మూలాన్ని బుధవారం ఏసీబీ కోర్టు నమోదు చేసుకుంది. దాదాపు గంటన్నరపాటు స్టీఫెన్సన్ ఇచ్చిన వాగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. ఆ సమయంలో కోర్టు హాలులోకి ఇతరులు ఎవ్వరినీ అనుమతించలేదు