ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఈ నెల 29 వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన సంగతి తెలిసిందే.