జెరూసలేం: హెజ్‌బొల్లా తీరుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మద్దతు కలిన హెజ్‌బొల్లా తనను, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నించి ఘోరమైన తప్పు చేసిందని’ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇటువటి ఘటనలు శత్రువులపై తాము సాగిస్తున్న న్యాయపరమైన యుద్ధాన్ని నిలువరించలేవని, ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను ఎవరూ ఆపలేరని నెతన్యాహు పేర్కొన్నారు.
నెతన్యాహు తన ట్విట్టర్ ఖాతాలో ‘ఇరాన్‌తో పాటు దాని ప్రతినిధులకు నేను ఒకటే చెబుతున్నాను.. ఎవరైనా సరే ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించాలని ప్రయత్నిస్తే, వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మేము ఉగ్రవాదులను, వారిని పంపేవారిని అంతమొందించడాన్ని కొనసాగిస్తాం. మేము మా దేశ బందీలను గాజా నుండి స్వదేశానికి తీసుకువస్తాం. మా ఉత్తర సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి చేరుస్తాం. ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి, రాబోయే తరాలకు ఈ ప్రాంతంలో భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు.
Israel PM Benjamin Netanyahu tweets, "The attempt by Iran’s proxy Hezbollah to assassinate me and my wife today was a grave mistake. This will not deter me or the State of Israel from continuing our just war against our enemies in order to secure our future. I say to Iran and its… pic.twitter.com/uX2MJvPcJe
— ANI (@ANI) October 19, 2024
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి తరువాత గాజాలో ఇజ్రాయెల్ తన ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. గాజాలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 93 మంది మృతి చెందారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడుల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల దాడుల్లో ఇప్పటి వరకు వందలమంది మృతిచెందారు.
ఇది కూడా చదవండి: నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే?
Comments
Please login to add a commentAdd a comment