జెరూసలేం: గాజా, హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో మరోసారి బాంబు దాడి జరిగింది. ఫ్లాష్ బాంబ్ దాడి కారణంగా పేలుడు ధాటికి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. బాంబు దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
వివరాల ప్రకారం.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాని నెతన్యాహు ఇంటి గార్డెన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఫ్లాష్ బాంబు దాడి జరిగింది. బాంబు దాడి సందర్బంగా గార్డెన్‌లో మంటలు చెలరేగాయి. ఇక, దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడితో అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, నెతన్యాహు ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి.
మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడిని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ త్రీవంగా ఖండించారు. నెతన్యాహు ఇంటిపై దాడికి సంబంధించి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహును రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ మాట్లాడుతూ.. ప్రధాని ఇంటిపై ఫ్లాష్ బాంబ్ విసరడం వల్ల రెడ్ లైన్ క్రాస్ చేసినట్లైంది.. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బాంబు దాడికి పాల్పడిన వారిపై ప్రతి దాడి తప్పదని కామెంట్స్ చేశారు.
Two Flares were fired earlier tonight at a Guard Shack outside the Home of Israeli Prime Minister Benjamin Netanyahu, in the Northern Town of Caesarea, the same Home that a Hezbollah Drone struck in October. Both Israeli Police and Shin Bet are Investigating. pic.twitter.com/0BfYEaN4Bq
— OSINTdefender (@sentdefender) November 16, 2024
Comments
Please login to add a commentAdd a comment