తిరువొత్తియూరు: మహిళా, అమె ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా నిత్తిరవిలై, వల్లవిలై తదేయుపురానికి చెందిన విజయదాసన్ కేరళలో జాలరిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య సంగీత (27). వీరికి సంజయ్ (7), బియూభూపర్ (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు నిత్తిరవిలై సమీపం కాంచీపురంలో అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. రెండు వారాల కిందట విజయదాసన్ చేపలు పట్టే పనికోసం కేరళ వెళ్లాడు. ఈ క్రమంలో గత 26వ తేదీ ఉదయం సంగీత, ఇద్దరు పిల్లలు గణపతియాన్ కడవు వంతెన సమీపం తామ్రభరణి నదిలో శవాలుగా తేలుతున్నారు. దీనిపై సంగీత తండ్రి మార్టిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిత్తిరవినై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శవపరీక్షలో ఈ ముగ్గురు హత్యకు గురైనట్టు తె లిసింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు హోమియోపతి డాక్టర్ ఇనయం, బుద్దనతురానికి చెందిన కలయరసన్ (27)లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
విచా రణలో కలయరసన్ ముగ్గురిని హత్య చేసినట్టు నేరం అం గీకరించాడు. అతను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. తాను విదేశంలో పని చేసి తిరిగి వచ్చిన తరువాత సంగీతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇలాగే ఇంటి సమీపంలో క్లినిక్ నిర్వహిస్తున్న హోమియోపతి డాక్టర్‌తోనూ సంగీతకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పలు సార్లు మందలించినప్పటికీ సంగీత హోమియోపతి డాక్టర్‌తో సంబంధాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలో గత 25వ తేదీ రాత్రి సంగీత ఇంటికి వెళ్లిన సమయంలో ఆమెతో వా గ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెంది ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బైకుపై తీసుకెళ్లి తామ్రభరణి నదిలో పడవేశాను. తరువాత రోజు ఉదయం సంగీత ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న చిన్నారులను మేల్కొలిపి మీ తల్లి దగ్గరకు తీసుకెళతానని బైకుపై ఎక్కించుకుని వెళ్లి తామ్రభరణి నదిలో తోసి హత్యచేసినట్టు తెలిపాడు. కేసు విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment