సాక్షి, అమరావతి : విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్య వైఖరితో విధిలేని పరిస్థితుల్లోనే కేంద్రం నుంచి వైదొలుగుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పూర్తి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్ట విభజన హేతుబద్ధంగా జరగలేదన్నారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఇలాగే వ్యవహరిస్తే ప్రజలకు జాతీయ పార్టీలపై విశ్వాసం పోతుందని అన్నారు. జాతీయ పార్టీలు జాతి ప్రయోజనాలకు పనిచేయాలని చెప్పారు.
జాతీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని, రాష్ర్టానికి రావాల్సిన నిధులపై జైట్లీ నిర్లక్ష్యంగా మాట్లాడటం బాధకలిగించిందన్నారు. ఒక్క రాష్ర్టానికే నిధులన్నీ ఇవ్వడం కుదరదన్న జైట్లీ ప్రకటన అసంబద్ధమని అన్నారు. రాష్ర్టానికి న్యాయం జరుగుతుందనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, విభజన హామీలు అమలు చేస్తారని ఆశించామని అన్నారు. విభజన హామీలన్నీ అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment