నేడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలం | nominated MLA Stevenson's statement willbe record in acb court | Sakshi
Sakshi News home page

నేడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలం

Published Mon, Jun 15 2015 3:29 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

నేడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలం - Sakshi

నేడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలం

- కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించనున్న ఏసీబీ
- ఆడియో, వీడియో రికార్డులపై నివేదికను కోర్టుకు సమర్పించనున్న ఎఫ్‌ఎస్‌ఎల్
- ఇక విచారణ మరింత వేగవంతం
- నేడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలం

సాక్షి, హైదరాబాద్:
‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోమవారం అత్యంత కీలక పరిణామాలు జరుగనున్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది. చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో స్టీఫెన్‌సన్ వాంగ్మూలం కీలకం కానుంది.

రూ.5 కోట్లు లంచం తీసుకుని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేసిన స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఏసీబీ ఇప్పటికే కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ సోమవారం స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో తనను ఎవరెవరు, ఏవిధంగా ప్రలోభపెట్టారు, ఎవరెవరు, ఏ హామీలిచ్చారన్న వివరాలను స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశముంది. చంద్రబాబు తనతో ఎప్పుడు, ఎవరి ద్వారా ఫోన్‌లో మాట్లాడారో చెప్పనున్నారు.

ఇక రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్‌లు ఉపయోగించిన ఫోన్ల కాల్ డేటా, స్టీఫెన్‌సన్ ఫోన్‌లో రికార్డయిన సంభాషణలు, రహస్య కెమెరాల వీడియో ఫుటేజీలను ఇప్పటికే కోర్టు ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి ప్రాథమిక నివేదిక ఇప్పటికే ఏసీబీకి అందింది. పూర్తిస్థాయి నివేదికలను ఎఫ్‌ఎస్‌ఎల్ సోమవారం కోర్టుకు సమర్పిస్తుందని అధికారవర్గాలు చెప్పాయి. ఈ నివేదిక కోర్టుకు అందితే విచారణ మరింత వేగవంతం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement