పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు.
హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
సువేందు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తృణమూల్‌పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు.
Simply Outrageous.
— Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024
TMC MLA of Tarakeswar Assembly Constituency - Ramendu Sinha Roy, who is also the TMC President of Arambagh Organizational District has labeled the Grand Ram Mandir as 'UNHOLY'. He has also stated that no Indian Hindu should offer Puja at such unholy site.… pic.twitter.com/xBBQuqpTzn
Comments
Please login to add a commentAdd a comment